OnePlus Tv Y1s: ఆండ్రాయిడ్ 11OS తో కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించిన వన్ ప్లస్
వన్ ప్లస్ Tv Y1s సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించింది
ఈ స్మార్ట్ టీవీలను 32 మరియు 43 ఇంచ్ సైజులో అందించింది
ఈ స్మార్ట్ టీవీలు HDR 10, HDR 10+ సపోర్ట్ తో వచ్చాయి
వన్ ప్లస్ Tv Y1s సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీలను 32 మరియు 43 ఇంచ్ సైజులో అందించింది. ఇందులో 32 ఇంచ్ టీవీ HD Ready స్మార్ట్ టీవీ కాగా, 43 ఇంచ్ టీవీ FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఇదే ప్రత్యేకతలతో మరో రెండు స్మార్ట్ టీవీలను కూడా Y1S Edge పేరుతో అందించింది. ఈ రెండు టీవీల మధ్య సౌండ్ పవర్ ఒక్కటే వ్యత్యాసం. ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా వన్ ప్లస్ నార్డ్ CE 5G స్మార్ట్ ఫోన్ మరియు వన్ ప్లస్ బడ్స్ Z2 లను కూడా విడుదల చేసింది.
Oneplus TV Y1S: ధర
Oneplus TV Y1S (32) HD రెడీ స్మార్ట్ టీవీ ధర: రూ.16,499
Oneplus TV Y1S (43) FHD స్మార్ట్ టీవీ ధర: రూ.26,999
ఫిబ్రవరి 21 నుండి ఈ స్మార్ట్ టీవీల సేల్ మొదలవుతుంది. ఈ స్మార్ట్ టీవీల పైన Axis బ్యాంక్ తక్షణ డిస్కౌంట్ కూడా ప్రకటించింది.
Oneplus TV Y1S: ఫీచర్లు
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S ఫీచర్ల విషయానికి వస్తే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తే, 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ (1920×1080) రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S రెండు స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీలకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.