ఇప్పటికే సరసమైన టీవీ విభాగంలోకి ప్రవేశిచినట్లు Oneplus ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కొత్తగా షేర్ చేసిన ట్వీట్ ద్వారా ఒకేసారి 3 బడ్జెట్ స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. జూలై 2 న భారతదేశంలో మూడు కొత్త టెలివిజన్లను ఆవిష్కరించబోతున్నట్లు వన్ ప్లస్ ధృవీకరించింది. ఈ కొత్త టెలివిజన్లను మార్కెటింగ్ చేయడం కోసం ముందునుండే టీజ్ చేస్తోంది మరియు రాబోయే సరసమైన టీవీల గురించి కొన్ని ముఖ్య వివరాలను వెల్లడించింది.
వన్‌ప్లస్ ప్రస్తుతం తన Q 1 సిరీస్‌లో రెండు టీవీలను విక్రయిస్తోంది మరియు కొత్త మరియు సరసమైన టీవీ సిరీస్ అని పిలవబడే ఈ టీవీల ధరల విషయంలో ఎటువంటి వివరాలు లేనప్పటికీ, భారతదేశంలో రాబోయే ఈ మూడు టీవీల గురించి కొన్ని ముఖ్య ముఖ్యాంశాలు కంపెనీ తన అధికారిక ఫోరమ్‌లో వెల్లడించింది.
https://twitter.com/OnePlus_IN/status/1276745670943051778?ref_src=twsrc%5Etfw
అధికారిక లాంచ్ వరకు, వన్‌ప్లస్ అమెజాన్ ఇండియాలో ఒక పోటీని నిర్వహిస్తోంది, దాని రాబోయే టెలివిజన్ల ప్రారంభ ధరను అంచనా వేయమని వినియోగదారులను కోరుతోంది. ఒక ట్వీట్‌లో, మూడు మోడళ్ల ప్రారంభ ధర గురించి కంపెనీ సూచించింది, ఇది 32 అంగుళాలు, 43-అంగుళాలు మరియు 55-అంగుళాలు వరుసగా 1X, 999, Rs 2X, 999 మరియు Rs 4X, 999 నుండి ప్రారంభమని, అని సూచిస్తుంది.
అదనంగా, రాబోయే వన్‌ప్లస్ టీవీలు దాదాపు 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియాతో దాదాపు అంచులు కనిపించని విధంగా స్క్రీన్ కలిగి ఉన్నాయని ధృవీకరించబడ్డాయి మరియు దాని అంచులు కేవలం 6.9 మి.మీ. మందంతో చాలా సన్నగా వుంటాయని, ఈ కొత్త టీవీలు HD , FullHD మరియు 4K UHD రిజల్యూషన్ ప్యానెల్స్‌తో Dolby Vision మరియు 93 శాతం DCI-P 3 కలర్ గాముట్ తో వస్తాయని భావిస్తున్నారు.
కొత్త వన్‌ప్లస్ టీవీలు జూలై 2 న భారతదేశంలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే వన్‌ప్లస్ టీజ్ చేసిన ఫీచర్ల ఆధారంగా మూడు టీవీల్లో ఏదైనా ఒకదాన్ని మీ సొంతం చేసుకోవాలనే ఆసక్తి ఉంటే, మీరు రాబోయే వన్‌ప్లస్ టీవీలను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా, రాబోయే వన్‌ప్లస్ టీవీలను ముందస్తు ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరూ 2 సంవత్సరాల అధిక వారంటీని పొందటానికి అర్హులవుతారు.