Oneplus: 43 ఇంచ్ 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ తీసుకువస్తున్నవన్ ప్లస్..!!
Oneplus 43 Y1S Pro లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా వెల్లడించలేదు
43 ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
ఇప్పటికే Y సిరీస్ నుండి చాలా స్మార్ట్ టీవీలను అందించిన వన్ ప్లస్ ఇప్పుడు మరొక స్మార్ట్ టీవీని కూడా ఈ వై సిరీస్ కు జతచేస్తోంది. లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ గురించి మాత్రం టీజింగ్ మొదలుపెట్టింది. త్వరలో రానున్నట్లు చెబుతున్న ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కోసం అమెజాన్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. Oneplus 43 Y1S Pro పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన ఫీచర్లతో టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ స్మార్ట్ టీవీని 43 ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీవీని అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు మాత్రం వెల్లడించింది. ఈ స్మార్ట్ టీవీ యొక్క రెండు ఫీచర్లను ఇప్పటికే వెల్లడించింది. ఈ టీవీని HDR 10 డీకోడింగ్ మరియు అతి సన్నని అంచులతో తీసుకువస్తున్నట్లు తెలిపింది.
ఇక ఇటివల ఇండియాలో విడుదల చేసిన Oneplus TV Y1S సిరీస్ నుండి వచ్చిన 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ సైజులో వచ్చిన స్మార్ట్ టీవీల గురించి ఈ క్రింద చూడవచ్చు.
Oneplus TV Y1S: ఫీచర్లు
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S ఫీచర్ల విషయానికి వస్తే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తే, 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ (1920×1080) రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S రెండు స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీలకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.