OnePlus TV: బడ్జెట్ సిరీస్ నుండి పెద్ద స్మార్ట్ టీవీ లాంచ్ చేస్తున్నవన్ ప్లస్.!

Updated on 29-Jun-2022
HIGHLIGHTS

అతి త్వరలో లాంచ్ కానున్న OnePlus 50 Y1S Pro

43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది

Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సౌండ్ తో వస్తుంది

2022 ఏప్రిల్ నెలలో బడ్జెట్ ధరలో Y1S Pro సిరీస్ 4K టీవీ ని తీసుకొచ్చిన వన్ ప్లస్, మరొక పెద్ద టీవీని ఈ బడ్జెట్ సిరీస్ నుండి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. అదే, OnePlus 50 Y1S Pro మరియు ఈ స్మార్ట్ టీవీని అతి త్వరలో లాంచ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని ఇంకా ప్రకటించనప్పటికీ ఈ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం టీజర్ ద్వారా బయటపెట్టింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ని అమెజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. 

ఇక స్మార్ట్ టీవీ వివరాల్లోకి వెళితే, వన్ ప్లస్ ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం వెల్లడించింది. ఈ వెల్లడించిన ఫీచర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది. అయితే, మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసినట్లు కూడా కనిపిస్తోంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ HDR 10 Decoding మరియు అతిసన్నని అంచులు (బెజెల్ లెస్) డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ AI-Powered విజువల్స్ ను అందిస్తుంది. అంటే, MEMC, డైనమిక్ కాంట్రాస్ట్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి వాటి సహాయంతో గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ని మరింత పెంచడానికి స్మార్ట్ మేనేజ్మెంట్ అప్షన్ ను కూడా జతచేసినట్లు చెబుతోంది.  

ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా వేల్లడించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :