వన్ ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ప్రకటించింది. OnePlus 50 Y1S Pro 4K UHD స్మార్ట్ టీవీ ని జూలై 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు లాంచ్ డేట్ ప్రకటించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను కూడా టీజర్ పేజ్ ద్వారా అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఇటీవల బడ్జెట్ ధరలో 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని తీసుకువచ్చిన అదే Y1S Pro సిరీస్ నుండి తీసుకువస్తోంది.
ఇక స్మార్ట్ టీవీ వివరాల్లోకి వెళితే, వన్ ప్లస్ ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం వెల్లడించింది. ఈ వెల్లడించిన ఫీచర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది. అయితే, మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసినట్లు కూడా కనిపిస్తోంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ HDR 10 Decoding మరియు అతిసన్నని అంచులు (బెజెల్ లెస్) డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ AI-Powered విజువల్స్ ను అందిస్తుంది. అంటే, MEMC, డైనమిక్ కాంట్రాస్ట్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి వాటి సహాయంతో గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ని మరింత పెంచడానికి స్మార్ట్ మేనేజ్మెంట్ అప్షన్ ను కూడా జతచేసినట్లు చెబుతోంది.
ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా వేల్లడించింది.