వన్ ప్లస్ పెద్ద టీవీని బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. వన్ ప్లస్ Y సిరీస్ నుండి ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని వన్ ప్లస్ విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి ముందుగానే 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు అందుబాటులో వున్నాయి. అయితే, Oneplus Y సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ టీవీని OnePlus 40Y1 మోడల్ నంబర్ తో 40 ఇంచ్ సైజులో విడుదల చేసింది. OnePlus 40Y1 స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ మరియు 20W పెద్ద సౌండ్ తో పాటుగా చాలా ఫీచర్లతో వస్తుంది. ఈ OnePlus 40Y1 స్మార్ట్ టీవీని కేవలం రూ.21,999 రూపాయల ధరకే ప్రకటించింది మరియు ఈ స్మార్ట్ టీవీ యొక్క సేల్ ఈరోజు స్టార్ట్ అయ్యింది.
ఈ OnePlus 40Y1 స్మార్ట్ టీవీ 1980×1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వుంటుంది. అంటే, ఇది FHD స్మార్ట్ టీవీ అన్నమాట. ఈ వన్ ప్లస్ కొత్త టీవీ వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది. ఇది వన్ ప్లస్ ఆక్సిజన్ ప్లే UI మరియు ఆండ్రాయిడ్ టీవీ UI తో కూడా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 తో పనిచేస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో వుంటుంది. ఈ టీవిలో ప్లే స్టోర్ నుండి వేల యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రైమ్ వీడియో , Netflix, Hotstar వంటి అన్ని పాపులర్ యాప్స్ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ టీవీ తక్కువ అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ఏరియాతో వుంటుంది. అంటే, చాలా సన్నని అంచులను కలిగి ఉంటుంది. ఇది 20W డాల్బీ ఆడియో సౌండ్ అందించ గల బాక్స్ స్పీకర్లను కలిగి వుంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ కనెక్టివిటీ పరంగా ,WiFi, 2 HDMI, 2USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వుంది. Flipakrt లో లిస్ట్ చెయ్యబడిన ఈ వన్ ప్లస్ కొత్త టీవీ మే 26 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకాలను సాగిస్తుంది.