వన్ ప్లస్ కొత్త బడ్జెట్ టీవీలను లాంచ్ చేయడాన్ని గురించి కొంతకాలంగా చేబుతూవస్తున్నా, ఎట్టకేలకు వన్ ప్లస్ తన Y సిరీస్ మరియు U సిరీస్ ద్వారా మూడు కొత్త టీవీలను ప్రకటించింది. Y సిరీస్‌లో రెండు టీవీలు ఉన్నాయి.అందులో ఒకటి 32 అంగుళాల హెచ్‌డి రెడీ టీవీ, మరొకటి 43 అంగుళాల FHD టీవీ మరియు వీటి ధర వరుసగా రూ .12,999, రూ .22,999 గా ప్రకటించింది.
ఇక U విషయానికి వస్తే, ఈ సిరీస్‌లో ప్రస్తుతానికి కేవలం ఒక టీవీ మాత్రమే ప్రకటించింది – అదే U 1. ఇక దీని ధర గురించి చూస్తే ఇది 49,999 రూపాయలతో ధరతో వుంటుంది. ఇది 55-అంగుళాల టీవీ మరియు HDR & Dolby Vision తో పాటు Dolby Atmos సపోర్ట్ కలిగి 4 కె రిజల్యూషన్‌ను తెస్తుంది. ఈ మూడు టీవీలు ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో నడుస్తాయి మరియు వన్‌ప్లస్ సొంత Oxygen Play UI తో వస్తాయి.
మేము పైన చెప్పినట్లుగా, వన్‌ప్లస్ వై సిరీస్ రెండు స్క్రీన్ పరిమాణాలలో వస్తుంది. అవి – 32-అంగుళాల HD Ready మరియు 43-అంగుళాల Full HD టీవీలు. డిస్ప్లే ప్యానెల్ DCIP -3 కలర్ స్పేస్‌లో 93 శాతం కవర్ చేస్తుందని మరియు పిక్చర్ నాణ్యతను పెంచడానికి వన్‌ప్లస్ గామా ఇంజిన్‌ను కలిగి ఉందని పేర్కొంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 తో నడుస్తుంది మరియు వన్‌ప్లస్ సొంత Oxygen Play UI తో వస్తుంది. ఇది షియోమి యొక్క ప్యాచ్‌వాల్ UI ని అధికంగా గుర్తు చేస్తుంది. ఇది వారి టీవీలలో షియోమి యొక్క డేటా సేవర్ లాగా పనిచేసే డేటా సేవర్ మోడ్‌ను కూడా తెస్తుంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ టీవీలో నడుస్తున్నందున, దీనికి క్రోమ్‌కాస్ట్ అంతర్నిర్మితంగా వుంటుంది మరియు గూగుల్ అసిస్టెంట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
IOS మరియు Android లో అందుబాటులో ఉన్న OnePlus Connect app ఉపయోగించి వినియోగదారులు ఈ టీవీలను నియంత్రించవచ్చు. టీవీని తమ మొబైల్ హాట్‌స్పాట్‌కు కనెక్ట్ చేయడానికి వారు ఈ యప్ ఉపయోగించవచ్చు. ఈ టీవీలు రెండు కూడా 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి.
32 అంగుళాల హెచ్‌డి రెడీ వన్‌ప్లస్ వై సిరీస్ టీవీ ధర రూ .12,999 కాగా, 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ వన్‌ప్లస్ వై సిరీస్ టీవీ ధర రూ .22,999 గా ప్రకటించింది. వన్‌ప్లస్ టీవీ వై సిరీస్ 32-అంగుళాలు అమెజాన్.ఇన్‌లో జూలై 5, 2020 నుండి అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ టీవీ వై సిరీస్ 43-అంగుళాలు త్వరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.