రేపు ఇండియాలో లాంచ్ కానున్నసరికొత్త NOKIA స్మార్ట్ టీవీ

రేపు ఇండియాలో లాంచ్ కానున్నసరికొత్త NOKIA స్మార్ట్ టీవీ
HIGHLIGHTS

ఈ 43 అంగుళాల టీవీని గురించి ఇప్పటికే టీజ్ చేసింది

ఈ టీవీని జూన్ 4 న, అంటే రేపు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.

ఇటీవల, 55 ఇంచ్ స్మార్ట్ టీవీతో ఇండియాలో టీవీ మార్కెట్ లోకి అడుగుపెట్టిన HMD గ్లోబల్ ఆధ్వర్యంలోని Nokia సంస్థ, ఇప్పుడు తన మరొక స్మార్ట్ టీవీని  ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్దముతోంది. త్వరలో విడుదల చేయనున్న ఈ 43 అంగుళాల టీవీని గురించి ఇప్పటికే టీజ్ చేసింది. ఈ టీవీని జూన్ 4 న, అంటే రేపు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ నోకియా 43-అంగుళాల టీవీతో తిరిగి వస్తున్నా, దాని 55-అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంటే, దీనిలో కూడా JBL  నుండి సౌండ్  మరియు ప్రత్యేకమైన లుక్ స్టాండ్ ఉండవచ్చు.

నోకియా 43-అంగుళాల టీవీ : ప్రత్యేకతలు

నోకియా 43-అంగుళాల టీవీ ముందుగా వచ్చిన పెద్ద TV  నుండి చాలా ఫీచర్లను పొందనుంది. ఈ టీవీ కూడా JBL ఆడియోతో వస్తుందని భావిస్తున్నారు. ఈ టీవీ 4 K టీవీ అవుతుందా అనేది ఇంకా ధృవీకరించబడలేదు కాని ఇది HDR ‌తో పాటు Dolby Vision కు కూడా మద్దతు ఇస్తుందని అంచనావేస్తున్నారు. ఈ టీవీ బాక్స్ నుండి బయటికి వస్తూనే ఆండ్రాయిడ్ టీవీలో నడుస్తుందని చెప్పబడింది. అందువల్ల, అన్ని ప్రసిద్ధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ తో  పాటు Play Store కూడా ఉంటుందని మనం ఆశించవచ్చు. 55 అంగుళాల నోకియా టీవీలో 10-బిట్ ADS ప్యానెల్ ఉంది, ఇందులో 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది 10-బిట్ కలర్ స్పేస్‌లో 85-90% ని కవర్ చేస్తుంది. 43 అంగుళాల టీవీ కూడా దీనికి మద్దతు ఇస్తుందని మేము ఆశిస్తున్నాము.

ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ నోకియా స్మార్ట్ టీవీ ఆడియో 24W సౌండ్ అవుట్‌పుట్‌తో JBL సిగ్నేచర్ సౌండ్ తో రావచ్చు. సౌండ్ ట్యూనింగ్ మరియు ఈక్వలైజర్ JBL  నుండి అందించబడతాయి. ఈ టీవీలో రెండు పూర్తి-శ్రేణి డ్రైవర్లు ఉన్నారు, ఫ్రంట్ ఫేసింగ్ ట్వీటర్లు మరియు డౌన్-ఫైరింగ్ మిడ్ మరియు లోయర్ రేంజ్ డ్రైవర్లు. ప్రత్యేక వూఫర్ మాత్రం లేదు. ర్ టీవీ Dolby Audio మరియు DTS-True Surround సౌండ్ కు కూడా మద్దతు ఇస్తుంది. 55 అంగుళాల నోకియా స్మార్ట్ టివి క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 2.25 జిబి ర్యామ్ మరియు 16 జిబి స్టోరేజ్‌తో నడుస్తుంది మరియు 43 అంగుళాల టివికి కూడా ఒకే స్పెక్స్ ఉండే అవకాశం ఉంది.ఇవన్నీ గమనిస్తే, ఈ  నోకియా టీవీ కూడా బరి ప్రత్యేకతలతో పాటుగా JBL సౌండ్ తో వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo