ఈరోజు Nokia స్మార్ట్ టీవీ మరొక సేల్
ఈ టీవీ Dolby Audio మరియు DTS True surround వంటి ప్రీమియం టెక్నాలజీకి కూడా మద్దతు ఇస్తుంది.
ఇండియాలో అనేకమైన గొప్ప ప్రత్యేకలతో విడుదలైనటువంటి, నోకియా స్మార్ట్ టివి యొక్క సేల్ flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవనుంది. ఈ టీవీ 55 అంగుళాల వేరియంటుతో రూ .41,999 ధరతో లభిస్తుంది. అయితే, ఈరోజు జరగనున్న సేల్ నుండి Bank Of Baroda యొక్క క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. కానీ, లోపల అందించిన షరతుల ప్రకారం గరిష్టంగా 1,500 రుపాయాలు డిస్కౌంట్ మాత్రమే ఇస్తున్నట్లు చెప్పబడింది.
నోకియా టీవీ : ప్రత్యేకతలు
ఇక ఫీచర్ల గురించి మాట్లాడితే, నెట్ ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోలకు మద్దతుతో ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 తో పాటుగా వస్తుంది. Android 9 శక్తితో నడిచే ఈ TV లో, వినియోగదారులు వారి స్ట్రీమింగ్ సేవలు మరియు యాప్స్ కోసం ప్లే స్టోర్‌కు కూడా యాక్సెస్ కలిగి ఉంటారు.
ఇక ప్యానెల్ విషయానికి వస్తే, ఇది 400 నిట్స్ బ్రైట్నెస్ తో 10-బిట్ ADS ప్యానెల్ కలిగి ఉంది. ఇది 10-బిట్ కలర్ స్పేస్‌లో 85-90% వరకు కవర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ కు మద్దతు ఇస్తుంది, ఇది డాల్బీ యొక్క ఆబ్జెక్ట్ బేస్డ్ HDR రెండరింగ్ తో నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సేవల ద్వారా డాల్బీ విజన్ కంటెంట్ చాలా అందుబాటులో ఉంది, కాబట్టి ఈ లక్షణాన్ని కలిగి ఉండటం ఈ టీవీకి ఒక వరంగా చెప్పొచ్చు.
ఆడియో విషయానికి వస్తే, ఈ నోకియా స్మార్ట్ టీవీ ఆడియో పరంగా 24W సౌండ్ అవుట్ పుట్ తో JBL పవర్డ్ స్పీకర్లతో వస్తుంది. సౌండ్ ట్యూనింగ్ మరియు ఈక్వలైజర్ రెండూ కూడా JBL సొంత సిగ్నేచర్ తో అందించబడతాయి. ఈ టీవీకి రెండు పూర్తి స్థాయి డ్రైవర్లు ఉన్నారు, ఫ్రంట్ ఫేసింగ్ ట్వీటర్లు మరియు డౌన్ ఫైరింగ్ మిడ్ మరియు లోయర్ రేంజ్ డ్రైవర్లు క్కోడా వున్నాయి, కానీ ప్రత్యేక వూఫర్ మాత్రం లేదు. మేము టీవీతో గడిపిన అతికొద్ది సమయంలోనే, ఇది ఆకట్టుకునేలా చిత్రాలను మరియు స్టీరియో విభజనతో పటు క్వాలిటీ సౌండ్ అందిస్తోందని, మేము మీకు ఖచ్చితంగా చెప్పగలం. ఈ టీవీ Dolby Audio మరియు DTS True surround వంటి ప్రీమియం టెక్నాలజీకి కూడా మద్దతు ఇస్తుంది.
ఈ నోకియా స్మార్ట్ టీవీ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ తో నడుస్తుంది. ఇది చిత్ర నాణ్యతను పెంచడానికి MEMC సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది మరియు "లాగ్స్ లేని స్క్రీన్ షిఫ్ట్ కోసం బ్లర్స్ మరియు జడ్జర్లను తొలగిస్తుంది, తద్వారా మంచి చిత్ర నిర్వచనాన్ని అందిస్తుంది" అని నోకియా పేర్కొంది.