ఆకర్షణీయ ధరలో భారీ ఫీచర్లతో విడుదలైన Nokia 43 ఇంచ్ స్మార్ట్ టీవీ
HMD గ్లోబల్, తన Nokia Smart TV ని భారతదేశంలో విడుదల చేసింది.
ఇది 43 అంగుళాల 4K LED స్మార్ట్ టివి.
ఈ స్మార్ట్ టీవీలో JBL సిగ్నేచర్ సౌండ్ మరియు Dolby Audio సౌండ్ సిస్టమ్ లభిస్తుంది.
ఎట్టకేలకు, ఎన్నో రోజుల నుండి తమ స్మార్ట్ టీవీ విడుదల గురించి టీజ్ చేస్తున్న HMD గ్లోబల్, తన Nokia Smart TV ని భారతదేశంలో విడుదల చేసింది. ముందునుండే ప్రకటించినట్లు, ఇది 43 అంగుళాల 4K LED స్మార్ట్ టివి. నోకియా యొక్క ఏ కొత్త స్మార్ట్ టీవీలో, వినియోగదారులు ఆండ్రాయిడ్ 9.0 తో అంతర్నిర్మిత Chromecast యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. అదనంగా, సంస్థ యొక్క స్మార్ట్ టీవీలు Netflix మరియు AmazonPrime వంటి చాలా యాప్స్ కి యాక్సెస్ కలిగి ఉంటాయి. కంపెనీ గత ఏడాది తన మొదటి స్మార్ట్ టీవీని ఈ-కామర్స్ సైట్ Flipkart ద్వారా విక్రయించింది.
నోకియా స్మార్ట్ టీవీ ధర
నోకియా యొక్కఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీని కొనడానికి మీరు 31,999 రూపాయలు ఖర్చు చేయాలి. ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మనున్నారు. అదనంగా, ఈ నోకియా స్మార్ట్ టీవీతో వినియోగదారులకు 1 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఈ టీవీ పూర్తి సెక్యూర్ ప్యాకేజీతో వస్తుంది, ఇందులో అదనపు రెండేళ్ల వారంటీ ఉంటుంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీ సేల్ జూన్ 8 నుండి ప్రారంభమవుతుంది.
నోకియా స్మార్ట్ టీవీ :ప్రత్యేకతలు
సంస్థ యొక్క ఈ లెటస్ట్ నోకియా 43 అంగుళాల 4K LED స్మార్ట్ టివి యొక్క డిస్ప్లే 3840 × 2160 పిక్సెళ్ల రిజల్యూషన్ కలిగి ఉంది. అంటే, ఈ టీవీ అల్ట్రా హై డెఫినేషన్(UHD) 4K LED స్క్రీన్ కలిగివుంటుంది మరియు మీ టీవీ అనుభవాన్ని మరింతగా పెంచడానికి ఇందులో Dolby Vision కి సపోర్ట్ ను అందించింది. ఈ టీవీలో ఆండ్రాయిడ్ 9.0 తో గూగుల్ ప్లే స్టోర్ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, వినియోగదారులు ఈ స్మార్ట్ టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ మరియు యూట్యూబ్ యాప్స్ కు యాక్సెస్ కలిగి ఉంటారు.
టీవీ యొక్క ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ టీవీకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. దీనితో నోకియా స్మార్ట్ టీవీకి 2 GB ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్‌తో 1 GHz Pure X క్వాడ్ కోర్ ప్రాసెసర్‌కు మద్దతు లభిస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలో మంచి సౌండ్ కోసం JBL సిగ్నేచర్ సౌండ్ మరియు Dolby Audio సౌండ్ సిస్టమ్ లభిస్తుంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL స్పీకర్లు మరియు సౌండ్ సిస్టం కలిగివున్నఏకైక టీవీ బ్రాండ్ గా నోకియా మాత్రమే నిలుస్తుంది. అంతేకాదు, సినిమా ధియేటర్ వంటి సౌండ్ మీ ఇంట్లో అందించడానికి వీలుగా DTS TrueSurround సౌండ్ సిస్టమ్ కూడా ఈ టీవిలో అందించింది. మరోవైపు, ఈ స్మార్ట్ టీవీకి కనెక్షన్ కోసం వై-ఫై, బ్లూటూత్ మరియు 3 HDMI వంటి ఫీచర్లు అందించబడ్డాయి.