ఇండియాలో అతితక్కువ ధరకే మంచి LED టీవీలను తీసుకొచ్చిన, Noble Skiodo, ఇప్పుడు రెండు ఒక సరికొత్త టీవీలను అదీకూడా అత్యంత చౌక ధరలో లాంచ్ చేసింది. ఈ టీవీలు HD రెడ్మి పిక్సెల్ రిజల్యూషన్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు రెండు 10 వాట్స్ స్పీకర్లతో వస్తాయి. అంటే, మంచి పిక్చెర్ క్వాలిటీతో పాటుగా పెద్ద సౌండ్ అందించగల స్పీకర్లతో ఈ కొత్త LED టీవీలను తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఉన్నవాటితో పాటుగా, Noble Skiodo తన పార్టీ ఫోలియోలో రెండు కొత్త HD Ready LED టీవీలను అందించింది. అందులో మొదటిది "NB24VRI01" మోడల్ నంబరుతో ఉండగా మరొకటి "NB32R01" మోడల్ నంబరుతో ఉంటుంది. అంటే, ఒక టీవీని 24 అంగుళాల సైజుతో, మరొకదాన్ని 32 అంగుళాల సైజులో విడుదల చేసింది. Noble Skiodo, ఈ 24N380C మోడల్ టీవీని Rs . 6,799 ధరతో, మరొక 32N380C మోడల్ టీవీని Rs . 8,499 ధరతో తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఈ ప్రత్యేకతలల్లో వచ్చిన వాటిలో ఈ రెండు మోడళ్ళు చౌకైన టీవీలుగా చెప్పొచ్చు.
ఇవి 1366 x 768 పిక్సెళ్ళతో HD Ready లో మీరు వీడియోని ఆనందించవచ్చు. అలాగే, ఇందులో అందించిన రెండు 10వాట్ల స్పీకర్లు ద్వారా పెద్ద సౌండుతో మ్యూజిక్ ని వినవచ్చు. ఈ టీవీలో, కనక్టవిటీ కోసం 1 HDMI మరియు 1USB పోర్టుతో వస్తుంది. ఈ ఈ రెండు మోడళ్ల టీవీలు అన్ని రిటైల్ స్టోర్లు మరియు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పెయిన్ అందుబాటులో వున్నాయి.