oneplus బ్రాండ్ వినగానే మనకు గుర్తొచ్చేవి రెండు విషయాలు అవి : ఒకటి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే రెండవది ఈ సంస్థ అందిచే ప్రొడక్ట్స్ ధరలు. అవును, ఈ విషయం మనం చెప్పకనే చెప్పే విషయం. అయితే, ప్రస్తుతం తన ట్విట్టర్ పేజీ మరియు అమేజాన్ ద్వారా చేస్తున్న టీజింగ్స్ చూస్తుంటే మనం ఇక్కడ మాట్లాడిన రెండవ విషయం, అంటే అధిక ధర మాట ఇక అబద్దం కాబోతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, త్వరలో విడుదల చెయ్యనున్న New ONEPLUS TV Series ని కేవలం రూ.20,000 కంటే తక్కువ ధరకే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ముందుగా, భారతదేశంలో చాలా గొప్ప ఫీచర్లతో ప్రీమియం ధరలో తన Oneplus TV Q1 Series స్మార్ట్ టీవీలను విడుదల చేసిన వన్ ప్లస్ సంస్థ, ఇప్పుడు నమ్మలేనంత తక్కువ ధరకే తన స్మార్ట్ టీవీ ని ఇండియాలో ప్రకటించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం, ఈ స్మార్ట్ టీవీ గురించి చేస్తున్న టీజింగ్ ప్రకటన గమనిస్తే, రానున్న ఈ టీవీ గురించి "Smart Tv Smarter Price" అని హైలైట్ చేసి చెబుతోంది. ఇంత గొప్పగా చెబుతున్న ఈ టీవీ యొక్క ధరను మాత్రం Rs.1X,999 రుపాయల ధరతో తీజ్ చేస్తోంది. అంటే, Rs.10,999 నుండి Rs.19,999 మధ్యలో రానున్న ఈ New ONEPLUS TV Series ధర వుంటుందని టీజ్ చేస్తోంది.
The price of the New OnePlus TV Series will be starting from ₹1X,999.
Can you guess the price