MiTV 4A 40 Horizon Edition: బడ్జెట్ ధరలో DTS-HD సౌండ్ తో వచ్చింది
MiTV 4A 40 Horizon Edition స్మార్ట్ టీవీ లాంచ్
చాలా సన్నని అంచులతో మరియు చక్కని డిజైన్ తో వచ్చింది
FHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్
షియోమి తన MiTV 4A 40 Horizon Edition స్మార్ట్ టీవీని ఈరోజు లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ Xiaomi స్మార్ట్ టీవీ చాలా సన్నని అంచులతో మరియు చక్కని డిజైన్ తో వచ్చింది. FHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా, రెండు 10W పవర్ ఫుల్ స్పీకర్లతో వుంటుంది. అంటే, గొప్ప పిక్చర్ క్వాలీటి మరియు పెద్ద సౌండ్ అందించే శక్తితో ఈ టీవీ వుంటుంది. ఈ MiTV 4A 40 Horizon Edition టీవీ యొక్క ధర ఫీచర్లు మరియు ఇతర ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.
MiTV 4A 40 Horizon Edition: Price
MiTV 4A 40 Horizon Edition స్మార్ట్ టీవీని షియోమి Rs.23,999 రూపాయల ధరతో విడుదల చేసింది. జూన్ 2 వ తేదీ మధ్యాహ్నం నుండి Mi.com, Flipkart మరియు రిటైల్ స్టోర్స్ నుండి ఈ స్మార్ట్ టీవీ అమ్మకాలు మొదలవుతాయి.
MiTV 4A 40 Horizon Edition
ఈ MiTV 4A 40 Horizon Edition స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ తో వస్తుంది. అంటే, ఇది మీకు (1980×1080) రిజల్యూషన్ తో పిక్చర్ క్వాలిటీ ఇస్తుంది. అంతేకాదు, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ టీవీ దాదాపుగా కనిపించని విధంగా సన్నని అంచులతో వుంటుంది. మంచి కలర్స్ అందించగల Vivid Picture Engine ఇందులో వుంది.
ఈ టీవిలో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వండింది. ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ DTS-HD మరియు Streo రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లలో రెండు 10×2 స్పీకర్లతో 20W సౌండ్ అందుతుంది.
ఈ షియోమి టీవీలో మల్టి కనెక్టివిటీ మీకు లభిస్తుంది. ఇందులో, WiFi, Ethernet , 3HDMI, మరియు 2 USB పోర్ట్స్ తో పాటుగా S/PDIF కూడా వుంది. ఇది Android 9 మరియు PatchWall OS తో పనిచేస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో వస్తుంది.