మైక్రోమాక్స్, తొలిసారిగా తన ఆండ్రాయిడ్ టీవీలను ఇండియాలో విడుదలచేసింది

Updated on 10-Nov-2018
HIGHLIGHTS

49 అంగుళాలు మరియు 55 అంగుళాల పరిమాణం గల ఆండ్రాయిడ్ టీవీలను వరుసగా Rs 51,990 మరియు Rs 61,990 ధరలతో విడుదల చేసింది.

మైక్రోమాక్స్ కంపెనీ యొక్క మొట్టమొదటి గూగుల్ ధ్రువీకృత టీవీలను విడుదల చేసింది.  ఈ టీవీలు 49-అంగుళాలు మరియు 55-అంగుళాలు పరిమాణంల, వరుసగా Rs 51,990 మరియు 61,990 ధరలతో ఉంటాయి.  ఈ రెండు టీవీలు కూడా HDR సపోర్ట్ చేయగల 4K రిజల్యూషన్ తో వస్తాయి. గూగుల్  ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్ఫారం మీద నడుస్తుంది కానీ AOSP(ఆండ్రాయిడ్ ఓపెన్ సెక్యూర్ ప్లాట్ఫారం) మాత్రం కాదు. ఈ టీవీలు ఆండ్రాయిడ్ ఓరెయోతో నడుస్తాయి మరియు Dolby మరియు DTS సౌండ్ అందిస్తాయి. ఈ టీవీలు క్వాడ్ కోర్ కోర్టెక్స్-A53 ప్రాసెసర్తో జతగా, 2.5GB DDR3 RAM మరియు 16GB EMMC స్టోరేజి సామర్ధ్యంతో వస్తాయి. ఈ మైక్రోమాక్స్ టీవీలు అంతర్గతంగా క్రోమ్ కాస్ట్ కలివుంటాయి. అంతేకాకుండా MHL, వాయిస్ ఎనేబుల్ సెర్చ్ తో కూడిన గూగుల్ అసిస్టెన్స్ వాయిస్ కంట్రోల్, Wi-Fi మరియు బ్లూటూత్ కి కూడా మద్దతిస్తాయి. ఈ టీవీలలో ఆడియో కోసం, 2×12 వాట్ల స్పీకర్లను అందించారు. నవంబర్ నుండి ఈ టీవీలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

"భారతదేశంలో మా యొక్క మొదటి గూగుల్ ధ్రువీకృత టీవీల విడుదల సందర్భంగా, మీ వినియోగదారులకి ఉన్నతమైన, మరియు స్పష్టమైన పిక్చెర్ క్వాలిటీ మరియు ఒక  గూగుల్ ప్లే స్టోర్ ఎంపికతో అందించడానికి మరొక అడుగు ముందుకు వేశాము. అధితమైన, స్పష్టమైన మరియు నాణ్యమైన ట్రూ లైఫ్ పిక్చెర్ క్వాలిటీని, ఒక పెద్ద స్క్రీన్ పైన ఆండ్రాయిడ్ ఎంపికతో ఆనందించాలనుకునే వినియోగదారులకి, మా యొక్క ఈ కొత్త టీవీలు అన్నివిధాలా సరిగ్గా సరిపోతాయని" మైక్రోమాక్స్ యొక్క ఇన్ఫోర్మాటిక్స్ డైరెక్టర్ అయినటువంటి, రోహన్ అగర్వాల్ తెలియచేసారు.

ముందుగా లాంచ్ చేయబడిన , చాలా 4K HDR టీవీల మనము చూశాము. షావోమి యొక్క 55-అంగుళాల 4K HDR టీవీ మరియు 49-అంగుళాల 1080p  మార్కెట్లో అందుబాటులో వుంది. అలాగే, ఇతర బ్రాండ్ టీవీలు అయినటువంటి, TCL, iFFALCON, Thomson మరియు ఇటువంటి చాల కంపెనీలు తమ UHD మరియు HDR పరిధి టీవీలను ఇప్పటికే మార్కెట్లో ప్రవేశపెట్టాయి.                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :