షియోమి లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేసిన కొత్త స్మార్ట్ టీవీ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ Mi TV 5X Series నుండి 43, 50 మరియు 55 ఇంచ్ సైజులో టీవీలు ప్రకటించబడ్డాయి. ఈ మూడు లేటెస్ట్ స్మార్ట్ టీవీలు కూడా Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తాయి. అంతేకాదు, హెవీ సౌండ్ మరియు మంచి పిక్చర్ క్లారిటీ ని అందించగల సత్తాతో మార్కెట్లో లాంచ్ చేసినట్లు షియోమి ప్రకటించింది.
Mi TV 5X Series స్మార్ట్ టీవీలు మూడు సైజుల్లో లభిస్తాయి. వీటిలో, 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ రూ.31,999 రూపాయల ధరతో, 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ రూ.41,999 రూపాయల ధరతో, 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ రూ.47,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యాయి. Buy From Here
ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీలు 43, 50 మరియు 55 ఇంచ్ పరిమాణంలో ఉంటాయి. ఈ టీవీల పరిమాణంతో పాటుగా సౌండ్ అవుట్‌పుట్‌లో కూడా తేడా వుంది. వీటిలో, 50-ఇంచ్ మరియు 55-ఇంచ్ వేరియంట్‌లు 40W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయి, 43-అంగుళాల టీవీ 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. కానీ, ఈమూడు టీవీలు కూడా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి.
ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఈ మూడు టీవీలు కూడా 4K రిజల్యూషన్ తో పాటు HDR10, HDR 10+ మరియు Dolby Vision సహా అన్ని ప్రముఖ HDR ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలు 94% DCIP-3 కలర్ స్పేస్ మరియు NTSC కలర్ స్పెస్ కి మద్దతు ఇవ్వగలదని షియోమి పేర్కొంది. అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్, ఆప్టికల్ పోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివుంది.
ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI తో పనిచేస్తుంది మరియు ఉచిత లైవ్ ఛానల్స్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలు 7 సెప్టెంబర్ మధ్యాహ్నం 12 గంటల నుండి Mi.com, Flipkart.com, Mi హోమ్, మి స్టూడియో మరియు క్రోమాలో అందుబాటులో ఉంటాయి.