LG New OLED: LG బ్రాండ్ నుంచి కొత్త OLED మార్కెట్లో విడుదల చేయబడింది. ఇది ప్రపంచపు మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీ. ఈ టీవీని ముందుగా CES 2024 ఈవెంట్ లో LG పరిచయం చేసింది మరియు ఇప్పుడు మార్కెట్ లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ ఓలెడ్ టీవీ రేటు చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి. ఈ టీవీ రేటు గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ టీవీ ప్రైస్ తో హైదరాబాద్ లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనవచ్చు.
ఈ ఎల్ జి ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ టీవీని అమెరికాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ టీవీని US మార్కెట్లో $60,000 (సుమారు రూ. 51,10,000) ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ టీవీ ఇండియాలో ఈ టీవీని లాంచ్ చేస్తుందో లేదో కంపెనీ ప్రకటించలేదు.
Also Read: జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 10 వేలకే 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!
LG ఈ స్మార్ట్ టీవీని 77 ఇంచ్ 4K ట్రాన్స్ పరెంట్ ఓలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్క్రీన్ ను రెగ్యులర్ మోడ్ మరియు ట్రాన్స్ పరెంట్ మోడ్ తో కూడా నడపవచ్చు. ఈ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు 4K AI సూపర్ అప్ స్కేలింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ OLED టీవీ LG యొక్క Alpha 11 ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ టీవీ 4K 120Hz రిఫ్రెష్ రేట్ తో గొప్ప గేమ్ ప్లే అందిస్తుంది. ఈ LG OLED స్మార్ట్ టీవీ DTS:X, AI Sound మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ జీరో కనెక్ట్ తో వస్తుంది.