చౌకధరలో పెద్ద సైజు 4K, HDR 10, డాల్బీ విజన్ టీవీలను విడుదల చేసిన kodak : ప్రారంభ ధర Rs.23,999
ఇవి చాలా సన్నని అంచులు కలిగి 15 శాతం ఎక్కువ స్క్రీన్ మీకు అందిస్తాయి.
కోడాక్ ఇండియాలో పెద్ద సైజుగల 4 కొత్త టీవీలను ఇండియాలో విడుదల చేసింది. ఇవి 4 సైజులలో లభిస్తాయి, అవి 43-ఇంచులు (43CA2022), 50 ఇంచులు (Kodak 50CA7077), 55-ఇంచులు (Kodak 55CA0909), 65-ఇంచులు (Kodak 65CA0101) మోడల్ నంబర్లతో వీటిని విడుదల చేసింది. ఇవి వరుసగా, Rs.23,999, Rs.27,999, Rs.30,999 మరియు Rs.49,999 ధరలతో ప్రకటించింది. ఈ టీవీలు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన మార్చి 19 వ తేది నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని కూడా పేర్కొంది.
ఇక ఈ టీవీలను అన్ని కూడా బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 9 Pie OS తో పనిచేస్తాయని కంపెనీ తెలియచేసింది. ఇక మరిన్ని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇవి Dolby Vision, HDR 10, మరియు మరింత ఎక్కువ స్టాండర్డ్ అయినటువంటి HLG కవరింగ్ తో ఉంటాయి. అంతేకాదు, ఈ టీవీలు వైడ్ కలర్ గాముట్ తో ఉంటాయి కాబట్టి మరింత విస్తారమైన రంగులను అందిస్తాయి. ఈ టీవీల మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇవి చాలా సన్నని అంచులు కలిగి 15 శాతం ఎక్కువ స్క్రీన్ మీకు అందిస్తాయి. ఆడియో పరంగా, ఈ టీవీలు ఎక్కువ ఆడియో సామర్ధ్యాలను కలిగిస్తో ఉంటాయి. అందులో, DTS మరియు Dolby Digital Plus వంటివి ముఖ్యమైనవి.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవీలు ARC, Bluetooth 5.0, USB 3 మరియు HDMI వంటి వాటి కనెక్టివిటీ సపోర్టుతో వస్తాయి. ఈ టీవీలు 60Hz రిఫ్రెష్ రేటుతో మరియు MEMC తో ఉంటాయి. ఈ టీవీలు కేవలం ఆండ్రాయిడ్ OS పనిచెయ్యడం ఒక్కటి మాత్రమే కాకుండా గూగుల్ అసిస్టెంట్ మరియు అంతర్గత Cromecast తో పాటుగా వస్తాయి. ఇక వీటితో పాటుగా జతగా వచ్చే వాయిస్-ఎనేబుల్ రీమోర్ట్ కంట్రోల్, సులభముగా టీవీని నియంత్రించవచ్చు.