కోడాక్ తన X7X Pro లైనప్ కి సరికొత్తగా మరొక టీవీని జత చేసింది. కొత్తగా జత చేసిన టీవీని 42 అంగుళాల పరిమాణంలో FHD రిజల్యూషనుతో FHDX7XPRO గా ప్రకటించింది. ఈ పెద్ద FHD స్మార్ట్ టీవీని కేవలం రూ.19,999 రుపాయల ధరతో ప్రకటించింది. ఈ టీవీ Android TV మరియు 60HZ రిఫ్రెష్ రేటుతో వస్తుంది.
ప్లాస్ట్రోనిక్స్ ప్రవేట్ లిమిటెడ్ నుండి ప్రకటించబడిన ఈ Kodak 42 ఇంచ్ FHD ఆండ్రాయిడ్ టీవీ Flipkart ప్రధాన భాగస్వామిగా విడుదల చెయ్యబడింది. ఈ టీవీలు జనవరి 20 నుండి Flipkart నుండి లభిస్తాయి.
Kodak 42 ఇంచ్ FHDX7XPRO టీవీ FHD రిజల్యూషన్, అంటే 1980×1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ Kodak టీవీ ఆండ్రాయిడ్ టీవీ లో నడుస్తుంది మరియు ఈ టీవిలో 1.4Ghz క్లాక్ స్పీడ్ గల క్వాడ్ కొర్ ప్రొసెసర్ Mali-450MP3 GPU వున్నాయి. ఈ టీవీ షార్ప్ నుండి IPS ప్యానల్ మరియు DLED బ్యాక్ లైట్ తో పాటుగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కలిగివుంది.
ఇక ఆడియో మరియు కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగి వుంటుంది మరియు కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు మరియు 2 USB పోర్టులతో పాటుగా ఈథర్నెట్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ మరియు లైన్ అవుట్ పోర్ట్ లను కూడా కలిగి వుంది.