Viera గ్రూప్ లో భాగమైనటువంటి JVC, ఇప్పుడు ఇండియాలో ఒక సరికొత్త టీవీ ని లాంచ్ చేసింది.ఇప్పటి వరకూ, ఒక టీవీ సౌండ్ పెంచుకోవడానికి సౌండ్ బాక్స్ లేదా సౌండ్ బారును కేవలం వైరుతో మాత్రమే అనుసంధానం చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు JVC తీసుకొచ్చిన రెండు కొత్త టీవీలతో అటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, ఈ టీవీ లను బ్లూటూత్ కనెక్టివిటీతో అందించింది. మరి అటువంటి ఈ కొత్త టీవీల యొక్క మరిన్ని విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?.
JVC తన పార్టీ ఫోలియోలో రెండు కొత్త ఫుల్ HD LED టీవీలను బ్లూటూత్ కనక్టివిటీతో అందించింది. అందులో మొదటిది "24N380C" మోడల్ నంబరుతో ఉండగా మరొకటి "32N380C" మోడల్ నంబరుతో ఉంటుంది. అంటే, ఒక టీవీని 24 అంగుళాల సైజుతో, మరొకదాన్ని 32 అంగుళాల సైజులో విడుదల చేసింది. JVC ఈ 24N380C మోడల్ టీవీని Rs . 7,499 ధరతో, మరొక 32N380C మోడల్ టీవీని Rs . 9,999 ధరతో తీసుకొచ్చింది.
ఇవి 1366 x 768 పిక్సెళ్ళతో వచ్చిన కూడా ఫుల్ HD లో మీరు వీడియోని ఆనందించవచ్చు. అలాగే, ఇందులో అందించిన ఇన్ మరియు అవుట్ బ్లూటూత్ సాంకేతికతతో, ఒకే సరి రెండు డివైజులను కనెక్ట్ చేసుకోవచ్చు. అధనంగా, ఇందులో అందించిన 24 వాట్ల బాక్స్ స్పీకర్లు ద్వారా పెద్ద సౌండుతో మ్యూజిక్ ని వినవచ్చు. ఈ టీవీలో Dolby Surround సౌండ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి, సినిమా చూస్తున్నపుడు మంచి అనుభూతినిస్తుంది.