JVC స్మార్ట్ టీవీలు కేవలం రూ. 7,499 నుండి ప్రారంభం : ప్రత్యేకతలు చూస్తే కళ్లుచెదరాల్సిందే

Updated on 17-Jun-2019
HIGHLIGHTS

JVC భారతదేశంలో 6 కొత్త ఎల్‌ఈడీ టీవీలను ప్రకటించింది.

ఈ తాజా JVC టీవీలు, స్మార్ట్ LED టివిలు కాబట్టి స్మార్ట్ కనెక్టివిటీ, ఇన్-బిల్డ్ బ్లూటూత్ తో వస్తాయి.

ఈ కొత్త టీవీలను కంపెనీ 24 నుంచి 39 అంగుళాల పరిధిలో విడుదల చేసింది.

వియరా గ్రూప్ జెవిసి, ఇటీవల ఒక కొత్త శ్రేణి టీవీలను ప్రవేశపెట్టింది. ఈ కంపెనీ, భారతదేశంలో 6 కొత్త ఎల్‌ఈడీ టీవీలను ప్రకటించింది. ఈ కొత్త సిరీస్ యొక్క ధరల  విషయానికి వస్తే, ఇవి అత్యంత సరసమైన ధరలకు లభిస్తాయి మరియు వాటి ప్రారంభ ధరలు రూ. 7,499 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త టీవీలను కంపెనీ  24 నుంచి 39 అంగుళాల పరిధిలో విడుదల చేసింది. ఈ  తాజా JVC టీవీలు,  స్మార్ట్ LED టివిలు కాబట్టి స్మార్ట్ కనెక్టివిటీ, ఇన్-బిల్డ్ బ్లూటూత్ తో వస్తాయి.

ఈ సరికొత్త సిరీస్ మొత్తంలో చాలా ప్రత్యేకమైన టీవీ గురించి మాట్లాడితే, JVC 32N3105C టీవీ చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన టీవీ ధర రూ .11,999 గా ఉంటుంది. ఈ JVC 32N3105C టీవీ ఇంటెలెక్చువల్ UI తో వస్తుంది, హోమ్ స్క్రీన్‌లో చూసేటప్పుడు  ఇది యూజర్ యొక్క ఆసక్తిని బట్టి కార్యక్రమాలను  చూపించగలదు మరియు కంటెంట్‌ను అందించగలదు. ఈ టీవీలో యూట్యూబ్ మరియు నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కంటెంట్ కోసం ఇన్ బిల్ట్ ఆప్స్ ఉన్నాయి. దీనితో, వినియోగదారులు వారి అవసరాలు కోసం మరియు ఇష్టమైన App ని ఇన్‌స్టాల్ చేయవచ్చు.

జెవిసి స్మార్ట్ ఎల్‌ఇడి టివిల ప్రత్యేక విషయాలు

ఈ టీవీల ప్రత్యేకత గురించి మాట్లాడితే, ఈ టీవీకి రిజల్యూషన్ 1366×768 పిక్సెల్స్ అందించబడ్డాయి. ఈ టీవీలో మీకు 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీనితో పాటు మిరాకాస్ట్ స్క్రీన్ కాస్టింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

అంతే కాదు, ఇందులో 3 హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి, కానీ దీనికి 2 యుఎస్‌బి పోర్ట్‌లు, బిల్ట్ ఇన్  వై-ఫై మరియు ఈథర్నెట్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. టీవీతో పాటు స్మార్ట్ రిమోట్ కూడా నావిగేషన్ చేయడాన్ని సులభం చేస్తుంది.

భారతదేశంలో జెవిసి స్మార్ట్ ఎల్‌ఇడి టివిల ధర మరియు లభ్యత

1. జెవిసి 24 ఎన్ 380 సి ధర  – Rs. 7,499

2. జెవిసి 32 ఎన్ 380 సి ధర  – Rs. 9,999

3. జెవిసి 32 ఎన్ 385 సి ధర  – Rs.11,999

4. జెవిసి 39 ఎన్ 380 సి ధర  – Rs.15,999

5. జెవిసి 39 ఎన్ 310 సి ధర  – Rs.16,999

6. జెవిసి 43 ఎన్ 7105 సి మరియు 55 ఎన్ 7105 టివిలతో సహా జెవిసి భారతదేశంలో అనేక హైటెక్ టీవీలను విడుదల చేసింది. దీనితో పాటు, జెవిసి 32 ఎన్ 3105 సి కూడా కొత్త శ్రేణికి చాలా ప్రత్యేకమైన పరికరం, దీని ధర రూ .11,999.

ఈ కొత్త టీవీల లభ్యత గురించి మాట్లాడుతూ, మీరు ఈ జెవిసి టివిలను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :