Jio New Plan: కేవలం రూ. 1,748 కే 336 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ అందించిన జియో.!
రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియో కి కొత్త ప్లాన్ ని జత చేసింది
ఈ ప్లాన్ 336 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది
Jio New Plan ను TRAI కొత్త దేశాల మేరకు తన యూజర్ల కోసం అందించింది
Jio New Plan: రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియో కి కొత్త ప్లాన్ ని జత చేసింది. ఇప్పటి వరకు కేవలం డేటా జతగా వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్లు మాత్రమే అందించిన జియో, ఇప్పుడు కేవలం వాయిస్ మరియు SMS ప్రయోజనాలతో మాత్రమే వచ్చే ప్రత్యేకమైన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా అందించింది. ఇందులో కేవలం రూ. 1,748 కే 336 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ను కూడా అందించింది.
ఏమిటా Jio New Plan?
రిలయన్స్ జియో సరికొత్తగా తీసుకు వచ్చిన రూ. 1,748 వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను TRAI కొత్త దేశాల మేరకు రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందించింది. ఈ ప్లాన్ ను ముందుగా రూ. 1959 రూపాయలకు 365 రోజుల వ్యాలిడిటీ తో విడుదల చేసింది.
అయితే, ఈ ప్లాన్ యొక్క టారిఫ్ రేటు మరింత తగ్గించాలనే TRAI సూచన మేరకు రూ. 211 రూపాయలు తగ్గించి ఇప్పుడు రూ. 1,748 రూపాయలకు ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ ప్లాన్ వ్యాలిడిటి ని 365 రోజుల నుంచి 336 రోజులకు కుదించి.
Also Read: Nothing Upcoming స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది.!
జియో రూ. 1,748 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 1,748 వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది.
ఇది మాత్రమే కాదు, ఈ వాయిస్ ఓన్లీ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో 3600 SMS వినియోగ సౌకర్యాన్ని కూడా అందచేస్తుంది. అలాగే, జియో వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్ మరియు జియో సినిమా యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here