Jio New Plan: అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ 98 రోజులకు అందించే కొత్త ప్లాన్ తెచ్చిన జియో.!

Jio New Plan: అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ 98 రోజులకు అందించే కొత్త ప్లాన్ తెచ్చిన జియో.!

Jio New Plan: రిలయన్స్ జియో యూజర్ల కోసం ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో 98 రోజులు అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ లాభాలు ఆఫర్ చేసేలా అందించింది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు మూడు నెలలకు పైగా అన్లిమిటెడ్ లాభాలను ఆస్వాదించవచ్చు.

ఏమిటా Jio New Plan?

రిలయన్స్ సరికొత్తగా తీసుకు వచ్చిన రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. రిలయన్స్ జియో అందించిన ఈ కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Jio రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్

Jio రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేట్ అందిస్తుంది. అదే 4జి నెట్ వర్క్ అయితే ప్రతిరోజు 2GB డేటా అందిస్తుంది.

Also Read: Redmi Watch 5 Lite స్మార్ట్ వాచ్ ఇన్ బిల్ట్ GPS మరియు AMOLED స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

అలాగే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో ప్రతి రోజు 100SMS వినియోగ సౌలభ్యం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లుకు కంప్లీట్ అన్లిమిటెడ్ లాభాలను మూడు నెలల కంటే ఎక్కువ రోజు అందిస్తుంది.

లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo