భారీ ఆఫర్లతో బడ్జెట్ ధరలో వచ్చిన Infinix X3 కొత్త స్మార్ట్ టీవీలు..!!

భారీ ఆఫర్లతో బడ్జెట్ ధరలో వచ్చిన Infinix X3 కొత్త స్మార్ట్ టీవీలు..!!
HIGHLIGHTS

Infinix X3 స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలో ప్రకటించి ఆశ్చర్యపరించింది

ఈ టీవీల పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుండి భారీ ఆఫర్లను కూడా అందించనుంది

ఇన్ఫినిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీలను 32 మరియు 43 ఇంచ్ సైజులో అందించింది

గత కొంత కాలంగా ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తున్న X3 స్మార్ట్ ఫోన్లను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలో ప్రకటించి ఆశ్చర్యపరించింది. అంతేకాదు, ఈ టీవీల పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుండి భారీ ఆఫర్లను కూడా అందించనుంది. ఇన్ఫినిక్స్ యొక్క X సిరీస్ నుండి ఈ రెండు స్మార్ట్ టీవీలను 32 మరియు 43 ఇంచ్ సైజులో అందించింది. వీటిలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready IPS స్క్రీన్ తో వస్తుండగా, 43 ఇంచ్ స్మార్ట్ టీవీ FHD VA ప్యానల్ తో వస్తుంది. అంతేకాదు, 32 ఇంచ్ టీవీ 20W సౌండ్ మాత్రమే కలిగి వుంటే 43 ఇంచ్ టీవీ 36W సౌండ్ అవుట్ ఫుట్ తో వస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీల ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల గురించి చూసేద్దామా.

Infinix X3: ధర మరియు ఆఫర్లు

Infinix X3 స్మార్ట్ టీవీలు మార్చి 12 నుండి మార్చి 16 వరకు జరగనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి ప్రీ-బుకింగ్ కోసం స్పెషల్ అఫర్ ధరలతో అందుబాటులో ఉంటాయి. అవి 32-ఇంచ్ టీవీ ధర రూ.11,999 మరియు 43-ఇంచ్ టీవీ ధర రూ.19,999. అంతేకాదు, No Cost EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా సేల్ నుండి ప్రీ బుకింగ్ ద్వారా పొందవచ్చు. అదనంగా, రూ.1 రూపాయికే Snooker బ్లూటూత్ హెడ్ సెట్ ఆఫర్ ని కూడా ఈ టీవీలతో జతచేసింది.       

infinix tv.jpg   

Infinix X3: స్పెక్స్

ఇన్ఫినిక్స్ ఎక్స్3 నుండి 32-అంగుళాల మరియు 43-అంగుళాల సైజు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది HD-రెడీ IPS ప్యానెల్‌ను కలిగి ఉంది మరియు  రెండవది FHD VA ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ టీవీ విజువల్స్ EPIC ఇంజిన్ 3.0 ఇమేజ్ ప్రాసెసర్ ద్వారా అందించబడ్డాయి. అంతేకాదు, గరిష్ట బ్రైట్నెస్, 122% sRGB కలర్ గాముట్, HDR10, HLG సపోర్ట్ మరియు యాంటీ-బ్లూ రే ఎమిషన్ ఫిల్టర్ మొదలుకొని 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ టీవీలు  కలిగివుంటాయి.

ఆడియో పరంగా, 32 ఇంచ్ స్మార్ట్ టీవిలో 20W స్టీరియో స్పీకర్ మరియు 43-అంగుళాల స్మార్ట్ టీవిలో 36W స్పీకర్ అవుట్‌పుట్‌ను అందించింది. అయితే, రెండూ స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 1 మినీ YPbPr వీడియో అవుట్‌పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45, మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్‌ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీలు కలిగివున్నాయి. ఈ టీవీలు 1GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో 64-బిట్ Realtek RTD2841 (A55x4) క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 11OS పైన రన్ అవుతాయి మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తాయి.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo