12 వేలకే బ్రాండెడ్ 32 ఇంచ్ HDR10 స్మార్ట్ టీవీ కావాలా..!!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది
ఈ భారీ సేల్ నుండి మంచి ఆఫర్లు అందించింది
స్మార్ట్ టీవి ఆండ్రాయిడ్ 11OS పైన రన్ అవుతాయి
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఉగాదికి ఒకరోజు ముందుగా మొదలైన ఈ భారీ సేల్ నుండి మంచి ఆఫర్లు అందించింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్న వారికి ఈ సేల్ నుండి మంచి ఆఫర్లు ఉన్నాయి. వాటిలో బెస్ట్ అఫర్ ను ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో ఇటీవలే విడుదల చెయ్యబడింది మరియు 30% డిస్కౌంట్ తో కేవలం రూ.12,499 ధరలో లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని కేవలం నెలకు రూ.434 రూపాయలు చెల్లించే EMI ద్వారా కూడా పొందవచ్చు.
Infinix లేటెస్ట్ గా X3 సిరీస్ నుండి ఇటీవల రెండు స్మార్ట్ టీవీలను మంచి ఫీచర్లతో విడుదల చేసింది. వీటిలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. Check Offer Here
Infinix X3: సిరీస్ స్మార్ట్ టీవీ అఫర్ ధరలు
Infinix X3 స్మార్ట్ టీవీలు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అఫర్ ధరలతో అందుబాటులో వుంది. ఈ సేల్ నుండి 32-ఇంచ్ టీవీ ధర రూ.12,499 మరియు 43-ఇంచ్ టీవీ ధర రూ.20,999.
Infinix X3: స్పెక్స్
ఇన్ఫినిక్స్ ఎక్స్3 నుండి 32-అంగుళాల మరియు 43-అంగుళాల సైజు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది HD-రెడీ IPS ప్యానెల్‌ను కలిగి ఉంది మరియు రెండవది FHD VA ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ టీవీ విజువల్స్ EPIC ఇంజిన్ 3.0 ఇమేజ్ ప్రాసెసర్ ద్వారా అందించబడ్డాయి. అంతేకాదు, గరిష్ట బ్రైట్నెస్, 122% sRGB కలర్ గాముట్, HDR10, HLG సపోర్ట్ మరియు యాంటీ-బ్లూ రే ఎమిషన్ ఫిల్టర్ మొదలుకొని 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ టీవీలు కలిగివుంటాయి.
ఆడియో పరంగా, 32 ఇంచ్ స్మార్ట్ టీవిలో 20W స్టీరియో స్పీకర్ మరియు 43-అంగుళాల స్మార్ట్ టీవిలో 36W స్పీకర్ అవుట్‌పుట్‌ను అందించింది. అయితే, రెండూ స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 1 మినీ YPbPr వీడియో అవుట్‌పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45, మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీలు కలిగివున్నాయి. ఈ టీవీలు 1GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో 64-బిట్ Realtek RTD2841 (A55x4) క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 11OS పైన రన్ అవుతాయి మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తాయి.