2022 దీపావళి పండుగ సందర్భంగా Flipkart తన Big Diwali Sale ని ప్రకటించింది. నిన్నటి నుండి మొదలైన ఈ సేల్ నుండి భారీ నుండి అతిభారీ ఆఫర్లను సైతం ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి రూ.23,999 రూపాయల అఫర్ ధరకే 50 ఇంచ్ బిగ్ 4K UHD స్మార్ట్ టీవీని పొందవచ్చని మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే మేము మీకుసహాయం చేస్తాము. ఎందుకంటే, ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 అఫర్ ధరతో లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఇక్కడ అందిస్తున్నాను.
అఫర్ విషయానికి వస్తే, Infinix ఇటీవల లాంచ్ చేసిన X3 50 inch 4K UHD స్మార్ట్ టీవీ Flipkart Big Diwali Sale నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇన్ఫినిక్స్ ఈ 50-ఇంచ్ టీవీని ఇటీవల రూ.25,000 ధరతో ఇండియాలో విడుదల చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ టీవీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది మరియు Axis, Citi మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి గరిష్టంగా 2,000 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ టీవీని మీరు మరింత చవక ధరకే పొందవచ్చన్న మాట.
ఇన్ఫినిక్స్ ఎక్స్3 50 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ను అందిస్తుంది మరియు ఇది 94% స్క్రీన్-టూ-బాడీ రేషియాతో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం 122% sRGB కలర్ గాముట్ తో వస్తుంది. అంతేకాదు, గరిష్ట బ్రైట్నెస్, HDR10 సపోర్ట్ మరియు యాంటీ-బ్లూ రే ఎమిషన్ ఫిల్టర్ మొదలుకొని 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ టీవీ కలిగివుంది.
ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 24W స్టీరియో స్పీకర్ లను అందించింది మరియు ఇది Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 1.5 GB RAM మరియు 16 GB స్టోరేజ్‌తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ టీవీ ఆండ్రాయిడ్ R OS పైన రన్ అవుతుంది. మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తుంది.