Smart TV: లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలు

Updated on 01-Aug-2021
HIGHLIGHTS

Infinix ఈరోజు రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది

FHD రిజల్యూషన్ తో రెండు సైజుల్లో మార్కెట్లోకి తీసుకొచ్చింది

పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసెర్

మార్కెట్లోకి మరొక కొత్త స్మార్ట్ టీవీ వస్తోంది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Infinix ఈరోజు రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ కొత్త టీవీలను FHD రిజల్యూషన్ తో రెండు సైజుల్లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ టీవీలు పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసెర్, 24W బాక్స్ స్పీకర్లు మరియు EPIC 2.0 పిక్చర్ ఇంజన్ వంటి మరిన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లతో ఈ టీవీలను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవలే, ఇన్ఫినిక్స్ తన మొదటి 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో ప్రకటించింది. ఇప్పుడు మరొక రెండు టీవీలను పరిచయం చేసింది. ఈ రెండు టీవీల ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం

Infinix ఆండ్రాయిడ్ టీవీ: ప్రైస్&స్పెక్స్

Infinix లాంచ్ చేసిన ఈ టీవీల యొక్క స్టార్టింగ్ ప్రైస్ రూ.19,999 రూపాయల నుండి మొదలవుతుంది. ఈ ధర 40 ఇంచ్ FHD  ఆండ్రాయిడ్ టీవీ కోసం నిర్ణయించబడింది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఆండ్రాయిడ్ OS తో వస్తాయి. అంతేకాదు,1 జిబి ర్యామ్ మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు టీవీలు కూడా చాలా సన్నని అంచులతో వస్తాయి. ఈ ఇన్ఫినిక్స్ టీవీలు రెండు స్పీకర్లతో టోటల్ 24W సౌండ్ అవుట్‌పుట్‌ అందిస్తాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తాయి.

ఇక 43 ఇంచ్ సైబర్‌సౌండ్స్ 4 కె ఆండ్రాయిడ్ టివి ధర రూ .23,999. ఇది కూడా చాలా సన్నని అంచులు కలిగిన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ర్ టీవీ కూడా 2 స్పీకర్లతో మొత్తంగా 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio ఆడియోతో కూడా వస్తుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ OS తో వస్తుంది మరియు దీనికి జతగా 8 జిబి స్టోరేజ్‌, 1 జిబి ర్యామ్‌ను కూడా కలిగి ఉంటుంది.    

క్లియర్ గా చెప్పాలంటే, ఈ రెండు టీవీలు కూడా విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండు టీవీల స్క్రీన్ సైజుల్లో మాత్రమే వ్యత్యాసం వుంటుంది. కనక్టివిటీ పరంగా, ఈ టీవీలు 3HDMI, 2USB పోర్ట్ మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తాయి. ఈ రెండు కొత్త టీవీలను X1 సిరీస్ లో భాగంగా తీసుకొచ్చింది.  మొత్తంగా ఈ సిరీస్ నుండి 32,40,మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీను అందించింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :