9 వేల కంటే తక్కువ ధరకే పెద్ద సైజు స్మార్ట్ టీవీ మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లో 10 వేల సబ్ కేటగిరిలో పోటీని మరింత పెంచే విధంగా Infinix తన కొత్త స్మార్ట్ టీవీని కేవలం 9 వేల కంటే తక్కువ ధరకే ప్రకటించింది. అదే, Infinix 32y1 స్మార్ట్ టీవీ మరియు ఈ టీవీ 32 ఇంచ్ పరిమాణంలో ఉంటుంది. ఈ టీవీ ధర తక్కువే అయినా ఫీచర్లను మాత్రం తగ్గకుండా అందించింది. ఈ టీవీ మొదటి సేల్ జులై 18 నుండి మొదలవుతుంది.
ఇన్ఫినిక్స్ ఈ Infinix 32y1 స్మార్ట్ టీవీని ఇండియన్ మర్కెట్లో వున్న బడ్జెట్ ఇతర స్మార్ట్ టీవీలకు గట్టి పోటీని ఇచ్చే ధరలో తీసుకువచ్చింది. ఈ 32-ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీని కేవలం ధర రూ.8,999 ధరలో ప్రకటించింది. జూలై 18 నుండి ఈ స్మార్ట్ టీవీ Flipakrt నుండి అందుబాటులో ఉంటుంది.
ఇక ఈ ఇన్ఫినిక్స్ 32వై1 32-అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ HD-Ready DLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ గరిష్టంగా 250 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W బాక్స్ స్పీకర్ లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంటుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, YPbPr వీడియో అవుట్‌పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45 మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 512MB RAM మరియు 4 GB స్టోరేజ్‌తో స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టీవీ Linux OS పైన రన్ అవుతుంది మరియు ఇన్ బిల్ట్ Wi-Fi మరియు మిరక్యాస్ట్ తో వస్తుంది.