Daiwa Made In India TV లను భారత దేశంలో విడుదల చేసింది మరియు Made In India వస్తువులను కొనాలని ఆలోచించే వారికీ ఇది నిజంగా గొప్ప శుభవార్త అవుతుంది. ఈ ఇండియన్ బ్రాండ్ Daiwa తన Make In India 4 K TVs సిరీస్ ని భారతదేశంలో మరింతగా విస్తరించింది. Daiwa తన 49 ఇంచ్ మరియు 55 ఇంచ్ 4K Ultra HD Smart TVs ఆండ్రాయిడ్ 9.0, HDR 10 మరియు DBX-టివి ఆడియో సపోర్ట్‌తో మరియు 2 సంవత్సరాల వారంటీతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ Daiwa Made In India టీవీలు, 49-అంగుళాల (D50BT162 – 124cm) మోడల్ టీవీ రూ. 29,999 / – ధరతో మరియు 55-అంగుళాల (D55BT162 – 140cm) రూ. 34,499 / – ధరతో విడుదల చేయబడ్డాయి.
ఈ Ultra 4K TV సిరీస్ డిబిఎక్స్-టివి ఆడియో, ఎ + గ్రేడ్ ప్యానెల్ మరియు క్వాంటం లుమినిట్ టెక్నాలజీతో 1.07 బిలియన్ కలర్లతో వస్తుంది. అద్భుతమైన వివరాలు, అద్భుతమైన రంగులు మరియు అద్భుతమైన కాంట్రాస్ట్ రేషియో వంటి విషయాలను ఏకం చెయ్యడం ద్వారా గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీతో సూపర్ పిక్చెర్ క్వాలిటీని ఇస్తుంది. 4K HDR10 తో, డార్క్ సీన్స్ లో కూడా, రంగుల యొక్క అపారమైన వర్ణపటాన్ని ఆస్వాదించవచ్చు. ఈ టీవీ 3840×2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ మరియు 40% మెరుగైన బ్రైట్నెస్ అందిస్తుంది. క్రికెట్ మోడ్, సినిమా మోడ్ మరియు బ్యాక్ లైట్ కంట్రోల్కొ వంటి చాలా కొత్త ఫీచర్లు ఈ కొత్త సిరీస్ లో భాగంగా ఉన్నాయి. సౌండ్ అవుట్పుట్ కోసం, టీవీలో 20 సౌండ్ మోడ్‌లతో 20 వాట్ బాక్స్ స్పీకర్ మరియు డిబిఎక్స్-టివి ఆడియో టెక్నాలజీ ఉన్నాయి.
కొత్త సిరీస్ ఆండ్రాయిడ్ 9.0 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఎ -55 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది 2 జిబి ర్యామ్ మరియు 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. రెండు టీవీలు డైవా యొక్క సొంత UI – The BIGWALL, ఇవి Disney+Hotstar, Zee5, SonyLiv, Jio Cinema మరియు మరెన్నో ఇటువంటి వంటి సర్టిఫైడ్ యాప్స్ తో వస్తుంది
కనెక్టివిటీ కోసం, టీవీలు3 HDMI ports, 2 USB, Wi-Fi, 1 ఆప్టికల్ అవుట్ పుట్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ కోసం ఇ-షేర్ మరియు మీ స్మార్ట్ ఫోన్ ను ఎయిర్ మౌస్‌గా ఉపయోగించడం కోసం తెచ్చింది. బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా ప్రేక్షకులు వారి వైర్ లెస్ హెడ్ ఫోన్స్ , మ్యూజిక్ సిస్టమ్ లను ఈ టీవీ లకు సెట్‌కు కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ భారతీయ సంస్థ Videotex International ఆధ్వర్యంలో భారతదేశంలో ఉద్భవించిన Daiwa గా పేరొందింది. గత 36 సంవత్సరాలుగా భారతదేశంలో టీవీలను తయారు చేస్తోంది మరియు 2020-21 ఆర్థిక సంవత్సరంలో క్యూ 3 మరియు క్యూ 4 లలో మరింత అధునాతన టెలివిజన్ సెట్లను తీసుకురావాలని ఈ బ్రాండ్ యోచిస్తోంది.