iFFLACON యొక్క 2 వ వార్షికోత్సవ కానుకగా చౌక ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు ప్రకటించింది

iFFLACON యొక్క 2 వ వార్షికోత్సవ కానుకగా చౌక ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు ప్రకటించింది
HIGHLIGHTS

F2A LED స్మార్ట్ టీవీ 40 inch లో 15,999 రూపాయలకు లభిస్తుంది.

ఈ అఫర్ మే 31 వరకూ మాత్రమే

TCL ఎలక్ట్రానిక్స్‌లో భాగమైన ప్రముఖ టెలివిజన్ తయారీదారు iFFALCON  భారతదేశంలో రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ రెండేళ్ల వేడుకల్లో భాగంగా, ఈ బ్రాండ్ రెండు స్మార్ట్ టీవీ మోడళ్లను విడుదల చేసింది అవి : F2A LED స్మార్ట్ టీవీ మరియు K31 AI UHD LED స్మార్ట్ టీవీ. F2A LED స్మార్ట్ టీవీ 40 అంగుళాలలో 15,999 రూపాయలకు లభిస్తుంది. ఈ K31 AI UHD LED స్మార్ట్ టీవీ రెండు సైజులలో వస్తుంది – 43 అంగుళాలు మరియు 55 అంగుళాలు. వాటి ధర వరుసగా రూ .20,999, రూ .29,999. ఈ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది మరియు మే 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

F2A LED స్మార్ట్ టీవీ

ఆండ్రాయిడ్ పై (9) యొక్క తాజా వెర్షన్ మరియు అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్ టీవీలు మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ వంటి అనేక ఇతర ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి.  ఇది బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్‌ను విడిగా సర్దుబాటు చేస్తుంది. ఇది వినియోగదారులు టీవీ చూసే అనుభవాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. ఇది Dolby డీకోడర్‌తో పాటుగా వస్తుంది. ఇది టీవీ యొక్క సౌండ్ నాణ్యతను మరింతగా పెంచుతుంది మరియు సాటిలేని సౌండ్  అందిస్తుంది.

ఈ టీవీ యొక్క మరో అధునాతన ఫీచర్ గా ఇందులోని స్మార్ట్ వాల్యూమ్ గురించి చెప్పొచ్చు. ఇది వీడియో కంటెంట్‌ను గుర్తించి, దానికి అనుగుణంగా సౌండ్ ని సర్దుబాటు చేస్తుంది. ఈ ఫీచర్లు అన్ని కలిసి,  ఇంట్లో సినిమాలు మరియు టీవీ సిరీస్ ‌లు చూడటానికి   వినియోగదారులు ఇష్టపడే  టీవీలుగా ఇవి ఉంటాయి మరియు ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ అప్డేట్ తో వస్తున్నాయి.

K31 AI UHD LED స్మార్ట్ టీవీ

పైన పేర్కొన్న లక్షణాలతో పాటు, ఈ టీవీ హ్యాండ్స్-ఫ్రీ AI వాయిస్ ఇంటరాక్షన్ వంటి మరింత అధునాతన లక్షణాలను అందిస్తుంది. దీనితో, వినియోగదారులు వాయిస్ ఆదేశాలతో పరికరాన్ని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ఇది AI డైనమిక్ పిక్చర్ సర్దుబాటు లక్షణాన్ని కూడా కలిగి ఉంది, ఇది ప్రదర్శన సెట్టింగులను స్వయంచాలకంగా సర్దుబాటు చేయడానికి తెలివైన AI అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది మాన్యువల్ జోక్యం లేకుండా వీక్షణ అనుభవాన్ని మరింత వాస్తవికంగా మరియు సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ టీవీ యొక్క తాజా వెర్షన్ – ఆండ్రాయిడ్ పై (9) తో ఉంటుంది.  ఇది శక్తివంతమైన పనితీరు, వేగవంతమైన రెస్పాన్స్  మరియు ఆహ్లాదంగా కంటెంట్‌ అనుభూతిని అందిస్తుంది.

దీనిపై ఇఫాల్కాన్ ప్రతినిధి మాట్లాడుతూ, “భారతదేశంలో రెండేళ్ల సేవలను పూర్తి చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం చాలా ఉత్తేజకరమైనది మరియు అనేక పాఠాలతో నేర్పింది. ఇది అడుగడుగునా క్రొత్త ప్రోడక్ట్స్ చేయటానికి మాకు ప్రేరణనిచ్చింది మరియు ఈ రోజుకు మనం చేరుకోవడానికి సహాయపడింది. ఆకర్షణీయమైన ధరలకు సూపర్ డీల్స్ ఈ సెలబ్రేషన్స్ లో భాగం చేశాము. మేము ఇప్పటికే ఉన్న మా ప్రోడక్ట్స్ మరియు సర్వుసులను మెరుగుపరచడం కూడా కొనసాగిస్తాము మరియు రాబోయే కాలంలో మరింత కొత్తదనం అందిస్తాము. ” అన్నారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo