సొంత OS తో Honor Vision మరియు Vision Pro స్మార్ట్ టీవీలను ప్రకటటించిన హానర్

Updated on 12-Aug-2019
HIGHLIGHTS

ఆరు 10W స్పీకర్లు మరియు పైన చిన్న పాప్-అప్ కెమెరా వంటివి ఉన్నాయి.

హువావే, ఇటీవల తన హార్మోనిOS  అని పిలువబడే తన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది మరియు ఈ సంస్థ యొక్క ఉప-బ్రాండ్ అయినటువంటి, హానర్ ఈ OS పై నడుస్తున్న మొదటి పరికరాలను కూడా విడుదల చేసింది. కొత్త హానర్ విజన్ మరియు హానర్ విజన్ ప్రో స్మార్ట్ టీవీలు హార్మొనీ OS పైన  నడుస్తున్నాయి మరియు అవి అనేక కొత్త ఫీచర్లతో ఉంటాయి. హానర్ విజన్ టీవీ యొక్క ప్రో మరియు నాన్-ప్రో మోడల్ మధ్య పెద్ద తేడా ఏమీ లేదు, ఎందుకంటే ఇవి రెండూ 55-అంగుళాల 4 K  అల్ట్రా HD డిస్ప్లే ప్యానల్‌ను కలిగి ఉంటాయి మరియు ఇవి క్వాడ్-కోర్ హోంఘు 818 SoC యొక్క శక్తిని కలిగి ఉంటాయి. ఈ  టెలివిజన్ యొక్క ప్రో వేరియంట్లో ఎక్కువ ఇన్ బిల్ట్  స్టోరేజి, నాలుగుకు బదులుగా ఆరు 10W స్పీకర్లు మరియు పైన చిన్న పాప్-అప్ కెమెరా వంటివి ఉన్నాయి.

హానర్ విజన్, విజన్ ప్రో స్పెసిఫికేషన్స్

హానర్ విజన్ మరియు హానర్ విజన్ ప్రో, ఒక 3840 × 2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో 55-అంగుళాల 4 K  ఐపిఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 400 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు మరియు NTSC కలర్ స్వరసప్తకం (Gamut ) లో 87 శాతం కవర్ చేస్తుంది. 178-డిగ్రీల యాంగిల్ వ్యూ తో పాటు, బ్లూ లైట్ ప్రొటెక్షన్ కోసం టియువి రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్, సన్నని మెటల్ ఫ్రేమ్‌లో ఈ డిస్ప్లే ఉంచబడింది, ఇది కేవలం 6.9 మిమీ అంచు (Bezel)  స్థలాన్ని తీసుకుంటుంది. ఈ టీవీలు హోంగూ 818 క్వాడ్-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి, ఇది మాలి-జి 51 తో జతచేయబడి మరియు 2 జిబి ర్యామ్‌తో వస్తుంది.

ఈ టీవీల్లో చిప్‌సెట్ లక్షణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది హై డైనమిక్ రేంజ్ ఇమేజింగ్ (HDR ), సూపర్-రిజల్యూషన్ (SR ), నాయిస్ రిడక్షన్ (NR ), మోషన్ ఎస్టిమేట్ అండ్ మోషన్ కాంపెన్సేషన్ (MEMC), డైనమిక్ కాంట్రాస్ట్ ఇంప్రూవ్‌మెంట్ (DCI ), ఆటో కలర్ వంటి కొన్ని ఆధునిక ఇమేజ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలను ఈ టీవీకి తెస్తుంది. ఈ హార్మొనీ OS 1.0 తో నడుస్తున్న ఈ టివిలలో మూడు HDMI పోర్ట్‌లు, ఒక USB 3.0 పోర్ట్, ఒక ఈథర్నెట్ పోర్ట్, బ్లూటూత్ వి 5, మరియు వై-ఫై 802.11 A  /B  /G  / N  / AC వంటి కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి.

అయితే, హానర్ విజన్ ప్రో ముందు భాగంలో పాప్-అప్ కెమెరాను కూడా కలిగి ఉంది, ఇది 1080p, 30fps వీడియో కాలింగ్‌కు అనుమతిస్తుంది. ఈ కెమెరాను 10 డిగ్రీల క్రిందికి వంచవచ్చు.

హానర్ విజన్, విజన్ ప్రో ధర మరియు లభ్యత

హానర్ విజన్  CNY 3,799 (రూ .38,200) ధరతో , హానర్ విజన్ ప్రో CNY 4,799 (సుమారు 48,200 రూపాయలు) ధరతో ఉంటాయి. ఈ పరికరాలు ప్రస్తుతం చైనాలో Vmall ద్వారా ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉన్నాయి మరియు ఆగస్టు 15 నుండి చైనాలో అమ్మకాలకు సిద్దమవుతాయి. ఈ కొత్త హానర్ విజన్ టీవీలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ప్రకటించబడతాయి లేదా అవి భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబడతాయి అనే దానిపై ఇంకా సమాచారం లేదు. .

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :