Hisense ఇండియాలో అతిపెద్ద 120-ఇంచ్ లార్జ్ 4K స్మార్ట్ లేజర్ టీవీ ఆవిష్కరించింది. అదే, 120L9G స్మార్ట్ లేజర్ టీవీ మరియు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రీమియం 120” 4K స్మార్ట్ లేజర్ టీవీ. ఈ అతిపెద్ద ALR స్క్రీన్ 120 అంగుళాలు పరిమాణంలో, 3000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ తో పాటుగా 4K UHD పిక్చర్ క్వాలిటీతో వస్తుంది. ఈ Hisense 4K స్మార్ట్ లేజర్ టీవీలో రంగులు చాలా రియల్ మరియు నేచురల్ గా ఉంటాయని కంపెనీ తెలిపింది. హైసెన్స్ సరికొత్తగా తీసుకొచ్చిన ఈ 4K స్మార్ట్ లేజర్ టీవీ యొక్క ధర మరియు ప్రత్యేకతలను వివరంగా తెలుసుకుందాం.
ఈ Hisense 120L9G 4K స్మార్ట్ లేజర్ టీవీ సినిమా హాలు వాటి అతిపెద్ద 120 ఇంచ్ సైజు స్క్రీన్ అందిస్తుంది. ఈ లేజర్ టీవీని Hisense రూ. 499,999 రూపాయల ధరతో ప్రకటించింది మరియు ఈ టీవీ జూలై 6 నుండి, అంటే ఈరోజు నుండి అమెజాన్ నుండి అందుబాటులో వుంది. ఈ టీవీ పైన లాంచ్ అఫర్ లో భాగంగా 3 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారెంటీని మరియు 4K Fire TV స్టిక్ మ్యాక్స్ ను కూడా హైసెన్స్ అందించింది.
ఈ 4K స్మార్ట్ లేజర్ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ మరియు MEMC తో పాటుగా వైడ్ కలర్ గ్యాముట్ (NTSC 145%) తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఒక Arc తో సహా 3 HMDI 2.0 పోర్ట్, 2 USB పోర్ట్స్, 1S/PDIF మరియు ఇన్ బిల్ట్ 5G Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ లేజర్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40 హెవీ సౌండ్ స్పీకర్ సిస్టం ను కూడా కలిగి వుంది. ఇది VIDAA ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.