JBL స్పీకర్లతో రెండు కొత్త టీవీలు లాంచ్ చేసిన Hisense

JBL స్పీకర్లతో రెండు కొత్త టీవీలు లాంచ్ చేసిన Hisense
HIGHLIGHTS

Hisense భారతదేశంలో రెండు కొత్త టీవీలను విడుదల చేసింది

ఈ టీవీలను Hisense Tornado (A73 series) పేరుతో ప్రకటించింది

ఈ టీవీలు 55 మరియు 65 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉంటాయి

Hisense భారతదేశంలో రెండు కొత్త టీవీలను విడుదల చేసింది. ఈ టీవీలను Hisense Tornado (A73 series)  పేరుతో ప్రకటించింది మరియు ఈ టీవీలు 55 మరియు 65 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉంటాయి. అయితే, వీటిలో 55 ఇంచుల టీవీ డిసెంబర్ 24 వ తేదీ నుండి లభిస్తుంది. కానీ, 65 అంగుళాల టీవీ మాత్రం 2021 మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుంది.

విడుదల సమయంలో హైసెన్స్ ఇండియా యొక్క COO అయిన రిషి టండన్ మాట్లాడుతూ, " భారతీయులు LED ల యొక్క సౌండ్ విషయంలో ఎల్లప్పుడూ అసంతృపిగానే వున్నారు. మంచి నాణ్యమైన మరియు పెద్ద సౌండ్ ను అందించే టీవీలు ఎక్కువగా మార్కెట్లో కనిపించవు. అందుకే, వినియోగదారులు సౌండ్ కోసం ఇతర ఆడియో పరికరాలను ఆశ్రయిస్తున్నారు. అందుకే, అందమైన సన్నని డిజైన్ తో పాటుగా క్రిస్టల్ క్లియర్ మరియు పెద్ద సౌండ్ అందించగల Hisense Tornado A73 4K HDR TV ని తీసుకొచ్చాము. నమ్మకమైన ఆడియో అనుభవాన్ని అందించడానికి JBL స్పీకర్ సిస్టంతో భాగస్వామ్యం చేశామని" తెలిపారు

Hisense Tornado A73 4K HDR TV స్పెసిఫికేషన్లు

ఈ Hisense Tornado A73 4K HDR TV లు 55 మరియు 65 ఇంచుల పరిమాణంలో  ఉంటాయి. స్క్రీన్ పరంగా, ఈ టీవీలు 4K (3840 x 2160) రిజల్యూషన్ HDR 10, Dolby Vision వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది మరియు ఆడియో పరంగా Dolby Atmos కు సపోర్ట్ చేతుంది.

ఈ టీవీ గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఈ టీవీలు అందించే సౌండ్. ఈ టీవిలో 6 స్పీకర్లు 4 పూర్తి-శ్రేణి డ్రైవర్లు మరియు 2 హై-ఫ్రీక్వెన్సీ డ్రైవర్లను తెస్తుంది. ఇది టీవీకి 102W సౌండ్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ టీవీలోని స్పీకర్లు JBL సౌండ్ టెక్నాలజీతో  పనిచేస్తాయి. టీవీ నుండి పెద్ద శబ్దం ఉన్నప్పటికీ, టీవీకి సాపేక్షంగా స్లిమ్ ప్రొఫైల్ ఉన్నట్లు కనిపిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo