మనం మన ఇంట్లోని గది, హల్ లేదా బెడ్ రూమ్ యొక్క పరిమాణాన్ని బట్టి టీవీని ఎంచుకోవాలి. అంటే, మీ అవసరాన్ని గుర్తించి టీవీని కొనండం మంచిది. ఎందుకంటే, మన రూమ్ చిన్నగా వుండి మన టీవీ పెద్దగా ఉంటే అది మీకు అంత గొప్పగా నచ్చకపోవచ్చు. అలాగే, మీరు మీ టీవిలో కోరుకునే క్లారిటీని కూడా మీ రూముకు తగినట్లుగా ఎంచుకోవాలి. అది ఎలాగో ఈ క్రింద చూడవచ్చు.
దీనిని HD రెడీ అని పిలుస్తారు మరియు ఈ టీవీ 1366×766 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉందని దీని అర్ధం. ఈ స్పష్టత, ఒక CRT TV నుండి వచ్చిన అప్గ్రేడ్ లేదా మొట్టమొదటి ఫ్లాట్ స్క్రీన్ టీవీని కొనుగోలు చేసేవారికి అనువైనది. మీరు మీ స్టాండర్డ్ డెఫినిషన్ (SD) సెట్ టాప్ బాక్సుల ద్వారా మాత్రమే ఈ కంటెంట్ చూడవచ్చు, లేదా 32inch లేదా అంతకంటే చిన్న బడ్జెట్ టీవీ కోసం మాత్రమే చూసేటప్పుడు ఇది మంచి ఎంపికగా ఉంటుంది.
ఇది 1920×1080 పిక్సల్స్ యొక్క FHD రిజల్యూషన్ కొలతగా చెప్పవచ్చు. ఈ FHD టీవీలు, HD రెడీ టీవీ కంటే రెండు రెట్ల పిక్సెళ్ళు కలిగి ఉంటాయి మరియు అధిక స్పష్టత ఇస్తుంది. తమ HD రెడీ టీవీ నుండి ఒక అప్డేట్ కోసం చూస్తున్నవారికీ ఇది సరిపోతుంది. తమ సెట్ – టాప్ బాక్సును అప్గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి కూడా ఇది ఉత్తమమైన ఎంపిక.
గమనిక: కొన్ని సంవత్సరాల క్రితం, పాత సెట్-టాప్ బాక్సుల ద్వారా ఉన్న కంటెంట్ చాలా సాధారణంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు, సెట్-టాప్ బాక్సులపై ఉన్న ఛానెల్లు చాలా వరకు HD లో ఉన్నాయి, ఇది మీరు మీ FHD TV తో చక్కగా చూడటానికి అనుమతిస్తుంది.
ఈ అల్ట్రా హై డెఫినిషన్ 4K గా కూడా పిలువబడుతుంది, ఇది 3840×2160 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ తో వస్తుంది. ఇది 4K గా పిలువబడుతుంది, ఎందుకంటే ఇది ఫుల్ HD (FHD)TV లకు 4 రెట్ల పిక్సల్స్ కలిగివుంటుంది. ఇది ముందునుండే FHD టీవీ లేదా పాత ప్లాస్మా టివిని కలిగి ఉన్నవారికి ఆదర్శవంతమైనది మరియు అప్గ్రేడ్ చేయటానికి చూస్తున్న వారికీ అనువైనది. ప్రస్తుతం, 4K కంటెంట్ అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, లేదా 4K అవుట్పుట్ను అందించే గేమింగ్ కన్సోల్ వంటి వాటితో ఈ సర్వీస్ అందిస్తుంది. కొంతమంది DTH ప్రొవైడర్లు కూడా 4K లో కంటెంట్ను అందించడం ప్రారంభించారు. 4K టీవీని కొనుగోలు చేస్తే, అన్నిటీవీ కంటెంట్లు 4K రిజల్యూషనుకు మారినపుడు, మీ టీవీ ఉత్తమమైన వీక్షణానుభూతిని అందించడం కొనసాగించగలదని నిర్ధారించవచ్చు.
TIP : మీరు ఫుల్ HD లేదా HD రెడీ టీవీలో కూడా 4k కంటెంట్ను ప్లే చేయగలరు. అయితే, మీరు చూసే రిజల్యూషన్ 4K కాదు కానీ మీ టీవీ మద్దతు ఇచ్చే రిజల్యూషన్లో దాన్ని చూపిస్తుంది.
ప్రయోజనం: అధిక రిఫ్రెష్ రేటు, అంటే టీవీలో సున్నితమైన చిత్రం
రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్లో సెకనుకు ఒక చిత్రం మార్చబడిన సంఖ్య. సాంప్రదాయకంగా ఒక చిత్రం సెకనుకు 24 ఫ్రేములు (చిత్రాలు) వద్ద చిత్రీకరించబడుతుంది (ఒక కదిలే చిత్రం చూపించడానికి ప్రతి సెకనుకు 24 సార్లు చిత్రం మార్చబబడుతుంది). అయినప్పటికీ, సాంప్రదాయిక 24 నుండి 120 మరియు 240 Hz (సెకనుకు ఫ్రేమ్లు) వరకు అత్యధిక రిఫ్రెష్ రేటును నేటి టీవీలకు మద్దతు ఇస్తుంది. స్పోర్ట్స్ లేదా యాక్షన్ సినిమాలు వంటి వేగంగా కనపడే సీన్స్ చూస్తున్నప్పుడు అధిక రిఫ్రెష్ రేట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలో కంటెంట్ ను మృదువైనదిగా చేస్తుంది. క్రికెట్, ఫుట్బాల్ లేదా ఫార్ములా 1 వంటి క్రీడలను టీవీలో చూడటం ద్వారా రిఫ్రెష్ రేటు ఇబ్బందిని తీర్చే సరళమైన మార్గం. రిఫ్రెష్ రేట్ అధిక, సున్నితమైన వేగవంతమైన కదిలే చర్య టీవీలో స్పష్టంగా కనిపిస్తుంది.
చిట్కా: నేటికాలంలో, ఎక్కువగా టీవీలు 60Hz రిఫ్రెష్ రేటుకు మద్దతును ఇస్తాయి. రోజువారీ టీవీ వాడకానికి ఇది మంచిది. అయినప్పటికీ, అధిక రిఫ్రెష్ రేటుతో క్రీడలు, యాక్షన్ సినిమాలు మరియు వీడియో గేమ్స్ వంటివా టి యొక్క అనుభూతి మరింత ఆదిభితంగా ఉంటుంది.
ఉపయోగం : ఒక దృశ్యంలో ఉన్నత కాంట్రాస్ట్ రేషియో = మరింత ఎక్కువగా కనిపించే వివరాలు.
ఒక్క మాటలో చెప్పాలంటే, నలుపు రంగు బూడిద కంటే నల్లగా కనిపించాలి.
కాంట్రాస్ట్ రేషియో అనేది ఒక టీవీ సృష్టించగల ప్రకాశవంతమైన ప్రతిమకు మధ్య వ్యత్యాసం మరియు ఇది పూర్తిగా మారిపోకుండా చేయగలిగే డార్క్ . అంటే, తెలుపు / నలుపు = కాంట్రాస్ట్ రేషియో. కాబట్టి, ఒక చిత్రంలో రాత్రి దృశ్యం ఉంటే, బాగా వెలిగించిన భవనాలలో, మీరు ప్రత్యేకంగా భవనం చుట్టూ నల్లని రాత్రిని చూడవచ్చు. ఒకవేళ, అది బూడిదరంగులో కనిపించినట్లయితే, టీవీకి మంచి కాంట్రాస్ట్ నిష్పత్తి లేదని అర్ధం. అధిక కాంట్రాస్ట్ నిష్పత్తి, ఎప్పుడూ మంచిది.
ప్రో చిట్కా: మీరు ఉత్తమమైన చిత్ర నాణ్యత కావాలనుకుంటే OLED టీవీలు వెళ్లడం మంచిది. ఎందుకంటే, ఇవి అనంతమైన కాంట్రాస్ట్ రేషియోని కలిగివుంటాయి. అటువంటి మంచి వ్యత్యాస నిష్పత్తిని ఉత్పత్తి చేయగల వాటి సామర్థ్యం, ఇవి అధిక ధర డిమాండ్ చెయ్యడానికి గల కారణాలలో ఒకటి.