Youtube Price Hike: యూట్యూబ్ ప్రీమియం ధర పెంచిన గూగుల్.!

Youtube Price Hike: యూట్యూబ్ ప్రీమియం ధర పెంచిన గూగుల్.!
HIGHLIGHTS

అత్యంత ప్రచురణ పొందిన వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కొత్త అప్డేట్ ను గూగుల్ వెల్లడించింది

యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ రేట్లు పెంచుతున్నట్లు గూగుల్ ప్రకటించింది

ఈ ప్లాన్స్ రేటు ఇప్పుడు 15 నుంచి 55 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది

Youtube Price Hike: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రచురణ పొందిన వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కూడా అప్డేట్ ను గూగుల్ వెల్లడించింది. యాడ్స్ తో ఉచిత వీడియోలను చూసే అవకాశం యూట్యూబ్ చాలా కాలంగా ఆఫర్ చేస్తోంది. అయితే, యాడ్స్ లేకుండా మరియు ప్రీమియం కంటెంట్ ను చూడటానికి ప్రీమియం ప్లాన్ ను కూడా అందించింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధర ప్రకటించిన చాలా కాలం తర్వాత ఈ ప్లాన్ రేట్లు పెంచుతున్నట్లు గూగుల్ ప్రకటించింది.

Youtube Price Hike

గూగుల్ యొక్క అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్, ప్రపంచ అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్ గా వర్ధిల్లుతోంది. సింపుల్ గా చెప్పాలంటే యూట్యూబ్ లేని మొబైల్ ఫోన్ ఉండదు. అంతగా యూట్యూబ్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అయితే, యూట్యూబ్ కు ఆదాయాన్ని తెచ్చి పెట్టె యాడ్స్ ను వీడియో లలో రన్ చేస్తుంది. యాడ్స్ తో వచ్చే ఉచిత సబ్ స్క్రిప్షన్ తో వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు.

Youtube Price Hike

అయితే, యాడ్స్ చూడటానికి ఇష్టపడిని వారి కోసం యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ను కూడా అందించింది. ఈ ప్లాన్ ను నెల, క్వార్టర్ మరియు వన్ ఇయర్ కోసం అందించింది. ఈ ప్లాన్స్ రేటు ఇప్పుడు 15 నుంచి 55 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Also Read: BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సెగ పుట్టించే బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ ఇదే.!

కొత్త రేట్లు ఎలా ఉన్నాయి?

ఇక గూగుల్ నిర్ణయించిన కొత్త రేట్లు విషయానికి వస్తే, నెలకు రూ. 129 రూపాయలుగా ఉన్న ఒక నెల (Individual) ప్లాన్ ను 15% పెంచి రూ. 149 రూపాయలు చేసింది. అలాగే, రూ. 399 రూపాయలుగా ఉన్న ఒక మూడు నెలల (Individual) ప్లాన్ ను 15% పెంచి రూ. 459 రూపాయలు చేసింది. అయితే, ఫ్యామిలీ ప్లాన్ ను మాత్రం భారీగా పెంచేసింది. కేవలం రూ. 189 రూపాయలుగా ఉన్న ఒక నెల ఫ్యామిలీ ప్లాన్ ను 55% పెంచి రూ. 299 రూపాయలు చేసింది.

అంతేకాదు, రూ. 79 రూపాయలుగా ఉన్న స్టూడెంట్ నెల వారి ప్లాన్ ను కూడా 12% పెంచి రూ. 89 రూపాయలు చేసింది. ఓవరాల్ గా చూస్తే యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ను 15% నుంచి 50% వరకు పెంచింది గూగుల్. ఇప్పుడు మీరు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కోసం అధిక రేటు చెల్లించాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo