43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K Smart TV అందుకోండి.. ఎక్కడంటే.!

Updated on 16-Jan-2025
HIGHLIGHTS

43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K Smart TV అందుకునే గొప్ప అవకాశం

ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 2GB ర్యామ్ తో వస్తుంది

ఈ స్మార్ట్ టీవీ Dolby Digitalమరియు DTS సౌం టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది

డిస్కౌంట్ ఆఫర్ తో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారిలో మీరు ఒకరైతే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ 4K Smart TV అందుకునే గొప్ప అవకాశం ఈరోజు మీకు అందుబాటులో ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చినటువంటి Monumental Sale నుంచి గొప్ప ఆఫర్ ని అందించింది. మరి ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూసేద్దామా.

ఏమిటా 50 ఇంచ్ 4K Smart TV ఆఫర్?

మోటోరోలా యొక్క EnvisionX సిరీస్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీని HDFC Bank క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీని అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. అంటే, ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే అందుకునే వీలుంది.

Also Read: Amazon Sale నుంచి 12 వేలకే LG Dolby Soundbar అందుకోండి.!

Motorola 4K Smart TV: ఫీచర్స్

ఈ మోటోరోలా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టొరేజ్ కలిగి ఉంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ Dolby Digital, Dolby Digital Plus మరియు DTS సౌం టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HMDI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :