Flipkart Big Saving Days సేల్ నుండి టీవీ కొనాలని చూస్తున్న వారికీ గుడ్ న్యూస్. కేవలం రూ.24,999 రూపాయలకే 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి చాలా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వాటిలో మంచి డిస్కౌంట్ తో అతితక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గురించి ఈరోజు చూద్దాం.
ఇక Flipkart సేల్ నుండి అఫర్ చేస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, Kodak ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ KODAK 7XPro మోడల్ నంబర్ 50UHDX7XPROBL ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 41% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే లభిస్తోంది. ఈ టీవీని Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ కోడాక్ 50 ఇంచ్ 4K UHD TV చాలా సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం HDR10+ సపోర్ట్ ను కలిగివుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 40W బాక్స్ స్పీకర్లను సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో అందించింది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ కోడాక్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ జతగా 2GB RAM మరియు 8GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ కోడాక్ టీవీ ఆండ్రాయిడ్ OS పైన రన్ అవుతుంది .