Flipkart సేల్ నుండి 25 వేలకే లభిస్తున్న రియల్ మీ 4K Dolby Vision స్మార్ట్ టీవీ..!!

Flipkart సేల్ నుండి 25 వేలకే లభిస్తున్న రియల్ మీ 4K Dolby Vision స్మార్ట్ టీవీ..!!
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది

ఈ సేల్ నుండి రియల్ మీ 4K స్మార్ట్ టీవీ పైన డీల్స్ ప్రకటించింది

Realme 4K UHD స్మార్ట్ టీవీని కేవలం 25 వేల రూపాయల ధరకే సొంతం చేసుకోవచ్చు

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి రియల్ మీ 4K స్మార్ట్ టీవీ పైన డీల్స్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో పాటుగా బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా జతచేసింది. మొత్తంగా, రియల్ మీ యొక్క 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అదికూడా Dolby Vision & Atmos లకు సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ టీవీని కేవలం 25 వేల రూపాయల ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ ముందుగా 29,999 ధరతో అమ్ముడయ్యింది మరియు గత Flipkart సేల్ నుండి రూ.26,999 డిస్కౌంట్ ధరకే అఫర్ చేసింది. అయితే, ఈరోజు మొదలైన లేటెస్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఎన్నడూ లేనంత చవక ధరకే సేల్ చేస్తోంది. అదనంగా, ఈ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, ప్రధాన బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డుతో కొనేవారికి కూడా 800 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Realme (43 inch) Ultra HD (4K): స్పెక్స్

Realme యొక్క ఈ 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన పిక్చర్ క్వాలీటిని కూడా అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ 5G Wi-Fi (Dual బ్యాండ్)  కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ  సపోర్ట్ కలిగిన 24W పవర్ ఫుల్ సౌండ్ అందించగల  స్పీకర్ల శక్తితో ఉంటుంది. తద్వారా అద్భుతమైన సౌండ్ మీకు అందించగలదు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo