భారీ డిస్కౌంట్ తో 33 వేలకే Mini LED Smart Tv అందుకోండి.!

బెస్ట్ Mini LED Smart Tv కోసం వెతుకుతున్న వారికి ఈరోజు గొప్ప డీల్
గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లభిస్తుంది
ఈ టీవీ ALLM మరియు MEMC ఫీచర్స్ తో మరింత క్లియర్ ఇమేజ్ కూడా అందిస్తుంది.
బడ్జెట్ ధరలో లేటెస్ట్ బెస్ట్ Mini LED Smart Tv కోసం వెతుకుతున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్లో విడుదలై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం 33 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది.
Mini LED Smart Tv : ఏమిటా ఆఫర్?
MOTOROLA భారత మార్కెట్లో గత సంవత్సరం విడుదల చేసిన 50 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (50UHDGMMWKRQ) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 40% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈరోజు ఈ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ రూ. 35,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 33,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
Also Read: OPPO F29 Pro 5G సూపర్ టఫ్ బిల్డ్ మరియు నెట్ వర్క్ బూస్ట్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!
Mini LED Smart Tv :
ఈ మోటోరోలా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10 సపోర్ట్, 140 లోకల్ డిమ్మింగ్ జోన్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ALLM మరియు MEMC ఫీచర్స్ తో మరింత క్లియర్ ఇమేజ్ కూడా అందిస్తుంది.
ఈ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.