Flipkart Big Diwali Sale నుండి మోటోరోలా స్మార్ట్ టీవీ పైన బిగ్ అఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి మోటోరోలా లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ.21,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ DolbyVision మరియు Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt స్పీకర్ సిస్టమ్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ మోటోరోలా స్మార్ట్ టీవీ డీల్ వివరాలను చూసేద్దామా.
అఫర్ విషయానికి వస్తే, MOTOROLA ఇటీవల లాంచ్ చేసిన Revou 2 43 inch 4K UHD స్మార్ట్ టీవీ Flipkart Big Diwali Sale నుండి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.21,999 రూపాయల అఫర్ దరకే లభిస్తోంది. అలాగే, Kotak మరియు SBI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 10% అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.
మోటోరోలా రేవో 2 43 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగిన VA ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం Dolby Vision మరియు HDR10 సపోర్ట్ ను కలిగివుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 24W స్టీరియో boAt బాక్స్ స్పీకర్ లను అందించింది మరియు ఇది Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 2 GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మోటోరోలా టీవీ ఆండ్రాయిడ్ 11 OS పైన రన్ అవుతుంది మరియు ALLM ఫీచర్ తో వస్తుంది.