Flipkart Sale: మోటోరోలా లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డీల్.!

Flipkart Sale: మోటోరోలా లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డీల్.!
HIGHLIGHTS

Flipkart Big Diwali Sale నుండి మోటోరోలా స్మార్ట్ టీవీ పైన బిగ్ అఫర్ ప్రకటించింది

మోటోరోలా లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీని రూ.21,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు

boAt స్పీకర్ సిస్టమ్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది

Flipkart Big Diwali Sale నుండి మోటోరోలా స్మార్ట్ టీవీ పైన బిగ్ అఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి మోటోరోలా లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీని మీరు కేవలం  రూ.21,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ DolbyVision మరియు Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt స్పీకర్ సిస్టమ్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ మోటోరోలా స్మార్ట్ టీవీ డీల్ వివరాలను చూసేద్దామా.     

అఫర్ విషయానికి వస్తే, MOTOROLA ఇటీవల లాంచ్ చేసిన Revou 2 43 inch 4K UHD స్మార్ట్ టీవీ Flipkart Big Diwali Sale నుండి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.21,999 రూపాయల అఫర్ దరకే లభిస్తోంది. అలాగే, Kotak మరియు SBI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 10% అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.

MOTOROLA Revou 2: స్పెక్స్

మోటోరోలా రేవో 2 43 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగిన VA ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం Dolby Vision మరియు HDR10 సపోర్ట్ ను కలిగివుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 24W స్టీరియో boAt బాక్స్ స్పీకర్ లను అందించింది మరియు ఇది Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్‌ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 2 GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మోటోరోలా టీవీ ఆండ్రాయిడ్ 11 OS పైన రన్ అవుతుంది  మరియు ALLM ఫీచర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo