సూపర్ డీల్: బిగ్ డిస్కౌంట్ తో 8 వేల ధరకే వెబ్ బ్రౌజర్ Smart Tv అందుకోండి.!

Updated on 06-Mar-2024
HIGHLIGHTS

కొత్త 32 ఇంచ్ వెబ్ బ్రౌజర్ Smart Tv ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ ను కూడా కలిగి వుంది

ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను

కొత్త స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరలో లేదా తక్కువ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఇటీవల ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ చేయబడిన కొత్త 32 ఇంచ్ వెబ్ బ్రౌజర్ Smart Tv ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ ను కూడా కలిగి వుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.

ఏమిటా వెబ్ బ్రౌజర్ Smart Tv ఆఫర్?

ప్రముఖ చైనీస్ బ్రాండ్ Infinix నుండి రీసెంట్ గా లాంఛ్ చెయ్యబడిన కొత్త 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Infinix Y1 (32 inch) HD Ready LED స్మార్ట్ Linux TV 2022 ఎడిషన్ పైన ఈ ఆఫర్ లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఈరోజు 47% భారీ డిస్కౌంట్ ను అందించిన కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకే Flipkart సేల్ చేస్తోంది.

Also Read: ఇక దేశంలో Cyber Fraud అనేదే ఉండదు.. ప్రభుత్వం కొత్త స్టెప్ అదిరిందిగా.!

అంతేకాదు, ఈ ఇన్ఫినిక్స్ 32 ఇంచ్ వెబ్ స్మార్ట్ టీవీని ప్రముఖ బ్యాంక్స్ Debit/Credit Card మరియు EMI ఆప్షన్ తో కొనే యూజర్లకు రూ. 500 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ధరలో మంచి ప్రత్యేకతలనే కలిగి వుంది మరియు Flipkart ప్లాట్ ఫామ్ పైన యూజర్ల ద్వారా 4.2 రేటింగ్ ను కూడా అందుకుంది.

Infinix Y1 (32 inch) టీవీ: ప్రత్యేకతలు

Infinix Y1 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ Linux ఆపరేటింగ్ సిస్టమ్ పైన పని చేస్తుంది. ఇందులో Prime Video, Youtube, Zee5 మరియు Sony LIV వంటి ప్రముఖ యాప్స్ ముందే Pre Install చేయబడి ఉంటాయి. అయితే, ఈ స్మార్ట్ టీవీ Netflix మరియు Disney+Hotstar యాప్స్ కి సపోర్ట్ చెయ్యకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయం.

Infinix Y1 (32 inch) Smart Tv Features

ఈ టీవిలో క్వాడ్ కోర్ ప్రోసెసర్ పని చేస్తుంది మరియు 4 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. 3 HDMI, 2 USB మరియు ఇన్ బిల్ట్ Wi -Fi వంటి అన్నాయి కనెక్టివిటీ సపోర్ట్ లు ఈ టీవీలో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ లో మంచి విజువల్స్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో గొప్ప సౌండ్ ను అందించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :