Smart TV: 23 వేలకే పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి..!!

Smart TV: 23 వేలకే పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి..!!
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్నారా

Flipkart మంచి డిస్కౌంట్ ధరలకే స్మార్ట్ టీవీలను సేల్ చేస్తోంది

23 వేలకే పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ కొనే అవకాశాన్ని అందించింది

బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరలకే సేల్ చేస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 23 వేలకే పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ కొనే అవకాశాన్ని అందించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ ఎలక్ట్రానిక్స్ సేల్ మార్చి 27 నుండి మార్చి 31 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. అధనంగా, 10% బ్యాంక్ డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను స్మార్ట్ టీవీల పైన అందిస్తోంది.

ఇక 23 వేల బడ్జెట్ ధరలో పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ COOCAA నుండి వచ్చిన Coocaa (43 inch) 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం రూ.22,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ఈ సేల్ నుండి Citi క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు Flipkart Pay Later కొనుగోలు చేసినా కూడా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

cooca 680.JPG

Coocaa (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Coocaa 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ 465 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 16W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo