ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. డిసెంబర్ 16 నుండి మొదలైన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి Coocaa బ్రాండ్ యొక్క 42 ఇంచ్ FHD స్మార్ట్ LED టీవీని భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ లేటెస్ట్ పెద్ద స్మార్ట్ టీవీని కేవలం 18 వేల కంటే తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. మీరు 20 వేల బడ్జెట్ లోనే ఒక పెద్ద స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నట్లయితే ఈ అఫర్ ను ఒకేసారి పరిశీలించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు Coocaa (42 inch) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 63% డిస్కౌంట్ తో రూ.17,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. అధనంగా, SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here
ఈ కూకా 42 ఇంచ్ FHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ UI (Android 9 Pie) పైన నడుస్తుంది. ఈ టీవీ Cortex A53 క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 16W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు బిల్ట్ ఇన్ Chrome Cast ని కలిగివుంటుంది.