QLED Smart Tv చవక ధరలో ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇండియాలో కొత్తగా విడుదలైన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇండియాలో సరికొత్తగా విడుదలైన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 16 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ కంపెనీ Daiwa ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. అదేమిటంటే, ఈ Daiwa (43 inch) UHD (4K) క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43G1Q) ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ 63% భారీ డిస్కౌంట్ తో రూ. 18,999 ధరకే లిస్ట్ చేసింది.
ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ తో 12 నెల EMI ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 16,999 రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిఉప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ అందుకుంది మరియు చవక ధరలో లభిస్తుంది.
Also Read: BSNL Top Plan: రోజుకు కేవలం రూ. 6 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!
Daiwa యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 X 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలేదు ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ డైవా టీవీ HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది ఎం మరియు Eye Care మోడ్ ను కూడా కలిగి ఉంది.
ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ లో Dolby Audio సపోర్ట్ వుంది మరియు 24W సౌండ్ అవుట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది . ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ టీవీ ఇప్పుడు 1+1 ఇయర్, అంటే రెండు సంవత్సరాల వారెంటీతో లభిస్తోంది.