Flipkart Big deal on latest 65 inch QLED Smart Tv from OH MY GADGETS Sale
Flipkart Big deal: ఈరోజు తో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ OH MY GADGETS సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన బ్రాండెడ్ 65 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి అందించింది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ సూపర్ డీల్ ను మీకోసం అందిస్తున్నాం. మరి ఆ డీల్ జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన realme TechLife CineSonic 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ముగియనున్న ఓ మై గ్యాడ్జెట్స్ సేల్ నుంచి 52% భారీ డిస్కౌంట్ తో రూ. 40,999 ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ రోజు అర్ధరాత్రి ముగియనున్న ఈ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో రూ. 39,499 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ ను చెక్ చేయడానికి Click here పైన నొక్కండి.
Also Read: Aiwa Dolby Soundbar అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!
ఈ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెహ్ రేట్ కలిగిన 65 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో క్వాడ్ కోర్ ప్రోసెసర్ ఉంటుంది మరియు జతగా 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్ సార్ట్ మరియు మరిన్ని OTT యాప్స్ తో పాటు గేమింగ్ యాప్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ లేటెస్ట్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో పాటు Total Sonic by DBX సౌండ్ సపోర్ట్ కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ టోటల్ 44W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.