చవక ధరలో 65 ఇంచ్ QLED Smart Tv కోరుకునే వారికి గుడ్ న్యూస్.!

చవక ధరలో 65 ఇంచ్ QLED Smart Tv కోరుకునే వారికి గుడ్ న్యూస్.!
HIGHLIGHTS

65 ఇంచ్ QLED Smart Tv కోరుకునే వారికి గుడ్ న్యూస్

ఈ రోజు చాలా చవక ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు

ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి

చవక ధరలో పెద్ద 65 ఇంచ్ QLED Smart Tv కోరుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ యొక్క రెగ్యులర్ సేల్ బిగ్ బచాత్ డేస్ నుంచి ఈరోజు గొప్ప క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ తో చాలా చవక ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోరుకునేవి వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేయండి.

65 ఇంచ్ QLED Smart Tv డీల్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు realme TechLife CineSonic 65 పొంచి క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై బిగ్ డిస్కౌంట్ అందించింది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ 51% భారీ డిస్కౌంట్ తో రూ. 41,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి.

QLED Smart Tv Deal

ఈ స్మార్ట్ టీవీ పై డిస్కౌంట్ మాత్రమే కాదు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

realme TechLife CineSonic : ఫీచర్స్

ఈ రియల్ మీ టెక్ లైఫ్ సినీ సోనిక్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ 44W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ Netflix, Amazon Prime, Hot Star, Youtube, Zee5 వంటి మరిన్ని OTT యాప్స్ తో పాటు చాలా ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo