ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా ఈ ఫోటోలను మాకు అందించింది మరియు JBL ఆడియోతో నడిచే నోకియా టివిని డిసెంబర్ నెల ప్రారంభంలో ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఉత్పత్తిగా లాంచ్ చేయనున్నదని మాతో ధృవీకరించింది.
ఈ నోకియా టీవీకి సౌండ్ ని అందిచడం ద్వారా JBL మొట్ట మొదటిసారిగా టివి ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ఈ టీవీ Dolby Audio & DTS TruSurround Sound సపోర్ట్‌తో JBL శక్తి కలిగిన స్పీకర్లను కలిగి ఉంది.
మీరు ఒక క్రొత్త స్మార్ట్ టీవీని కొనడానికి చూస్తున్నట్లయితే, మీ ఉత్సాహాన్ని కొంత అదుపులో పెట్టుకోండి. నోకియా తన స్మార్ట్ టీవీని ఆండ్రాయిడ్‌తో ఫ్లిప్‌కార్ట్ యూనిక్ ప్రొడక్ట్‌గా విడుదల చేస్తోందని, రాబోయే టీవీకి JBL ఆడియోతో పనిచేస్తుందని ఫ్లిప్ కార్ట్ మాకు స్పష్టపరిచింది. పై చిత్రం నుండి, ఈ టీవీ ఎలా ఉంటుందో మీకు ఒక అవగాహన వచ్చివుంటుంది. ఈ టీవీ నుండి వచ్చే సౌండ్ అవుట్ పుట్ ను JBL సౌండ్ సిస్టమ్ స్పీకర్లు నుండి రానున్నట్లు మనం చూడవచ్చు. ఈ చిత్రం నుండి, ఈ టీవీలో ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయని కూడా స్పష్టమవుతుంది.
ఈ రోజుల్లో టీవీల్లో బలహీనమైన అంశాలలో ఒకటి ఆడియో అవుట్ పుట్. JBL తో భాగస్వామ్యం ద్వారా, రాబోయే నోకియా టివిలలో JBL ప్రమాణాల ప్రకారం సౌండ్ ట్యూనింగ్ తో పాటు JBL రూపొందించిన సౌండ్ ను వినియోగదారులు ఆశిస్తారు. క్లియర్ వోకల్ టోన్స్ మరియు మినిమల్ హార్మోనిక్ డిస్టార్షన్ వంటి ఫీచర్లతో టీవీ వస్తుందని ఫ్లిప్ కార్ట్ డిజిట్‌కు ధృవీకరించింది. JBL స్పీకర్లు ఉన్నతమైన ధ్వని విశ్వసనీయతకు ప్రసిద్ది చెందాయి, అందువల్ల నోకియా టివి వీటికి వాగ్దానం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. JBL నుండి స్పీకర్లతో పాటు, టివి Dolby Audio & DTS TruSurround సౌండ్ ను కూడా తీసుకువస్తుంది, ఇది మీ టీవీ వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. Dolby Audio & DTS TruSurround తో, ఈ టివి అధిక విశ్వసనీయ ఆడియోను డీకోడ్ చేయగలదు మరియు ఈ టివిలు JBL శక్తితో స్పీకర్ల నుండి మీ కోసం సౌండ్ ప్లే చేస్తుంది. DTS TruSurround తో ఈ టీవీ 5.1 సరౌండ్ సౌండ్‌ను డీకోడ్ చేయగలదు మరియు టీవీ యొక్క JBL స్పీకర్ల ద్వారా మీకు సౌండ్ ప్లే చేస్తుంది.
ఇక ఈ నోకియా టీవీ యొక్క ఇతర స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళితే, ఇది 4 K రిజల్యూషన్ తో 55 అంగుళాల పరిమాణం కలిగిన టీవీ. ఇంతకు ముందు మేము నివేదించిన స్టోరీ లో, నోకియా బ్రాండ్ పార్ట్‌నర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ విపుల్ మెహ్రోత్రా మాట్లాడుతూ, “దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మొట్టమొదటి నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టివిలను భారతదేశానికి తీసుకువస్తుందని మేము సంతోషిస్తున్నాము. ఈ రోజు నోకియా బ్రాండ్ కోసం కొత్త విభాగంలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ” అన్నారు.