EXCLUSIVE: NOKIA TV లో ఇంటలిజంట్ డిమ్మింగ్, DOLBY VISION మరియు వైడ్ కలర్ గ్యామూట్ సపోర్ట్ కన్ఫర్మ్ చెయ్యబడింది.
ఈ అప్ కమింగ్ నోకియా స్మార్ట్ టీవీ గురించి ఫ్లిప్ కార్ట్ DIGIT కి ఎక్స్క్లూజివ్ గా తెలియచేసింది.
ఈ టీవీ ఇంటలిజంట్ డిమ్మింగ్, DOLBY VISION మరియు వైడ్ కలర్ గ్యామూట్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ టీవీ బెజెల్స్ లేని డిస్ప్లే మరియు ప్రీమియం మెటాలిక్ ఫినిష్ ఫ్రేముతో రానున్నట్లు కూడా ధృవీకరించబడింది.
నోకియా స్మార్ట్ టివి యొక్క విడుదల ముందుండగా, ప్రారంభించటాని కంటే ముందు, ఫ్లిప్ కార్ట్ ఈ టివి యొక్క ఫీచర్లు మరియు డిజైన్ గురించిన సమాచారాన్ని DIGIT కి ధృవీకరించింది. ఇక ఫీచర్లతో ప్రారంభిస్తే, ఈ నోకియా స్మార్ట్ టీవీ ఇంటెలిజెంట్ డిమ్మింగ్ కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇంటెలిజెంట్ డిమ్మింగ్ స్క్రీన్ పైన ఉన్న చిత్రాన్ని అర్థం చేసుకుంటుంది మరియు చిత్రాన్ని మెరుగుపరచడానికి కాంట్రాస్ట్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఇంటెలిజెంట్ డిమ్మింగ్ ఇమేజ్ సమాచారాన్ని అదే సమయంలో ప్రాసెస్ చేస్తుంది మరియు ఇమేజ్ యొక్క ముదురు ప్రదేశాలలో LED లను మసకబారుస్తుంది, దీనితో చిత్రంలో మీకు డార్కర్ బ్లాక్స్ మరియు వైటర్ వైట్స్ అందిస్తుంది. మొత్తంగా కలగలసి, మెరుగైన వీక్షణ అనుభవాన్ని ఇస్తాయి.
తరువాత విషయానికి వస్తే, మనకు వైడ్ కలర్ గాముట్ (WCG) ఉంది, ఇది ఈ టివిలో ఉన్నట్లు కూడా ధృవీకరించబడింది. 1 బిలియన్ రంగులలో 40-50% మాత్రమే ఉపయోగించే WCG యేతర టీవీలతో పోల్చితే, WCG తో రాబోయే నోకియా టీవీ అందుబాటులో ఉన్న 1 బిలియన్ రంగులలో 85% కంటే ఎక్కువ ఉపయోగిస్తుందని ఫ్లిప్ కార్ట్ మాకు తెలిపింది. ఒక్కమాటలో చెప్పాలంటే, WCG ఈ టీవీని మరిన్ని రంగులను ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. WCG కారణంగా, డిస్ప్లేలో ఉన్న రంగు పాలెట్ విస్తృతమైనది, ఇది చిత్రం లోతైన మరియు రిచ్ కలర్స్ చూపించడంలో సహాయపడుతుంది. WCG బిట్ డెప్త్ పెంచడానికి సహాయపడుతుంది. ఇది మణి నీలం మరియు ముదురు నీలం మధ్య ఎక్కువ షేడ్స్ అందుబాటులో ఉండటానికి అనుమతిస్తుంది.
చివరిది మరియు విలువైనది ఏమిటంటే, ఈ నోకియా స్మార్ట్ టీవీ కూడా Dolby Vision కు మద్దతు ఇస్తుందని నిర్ధారించబడింది. డాల్బీ విజన్ డాల్బీ యొక్క HDR ప్రమాణం మరియు సాధారణంగా హై-ఎండ్ ఫ్లాగ్ షిప్ టీవీల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన ఫీచర్. నెట్ ఫ్లిక్స్ కంటెంట్ యొక్క పెద్ద జాబితా డాల్బీ విజన్ లో అందుబాటులో ఉంది. అలాగే, 4 K HDR Blu-Ray ఈ లక్షణానికి మద్దతు ఇస్తాయి. కాబట్టి, ఈ ఆఫర్ లో విశ్వసనీయతను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి, డాల్బీ విజన్ ఎనేబుల్ చేసిన టీవీని కలిగి ఉండటం అద్భుతమైన చిత్రాలను చూడడానికి తోడ్పడుతుంది.
ఇక ఫీచర్ల నుండి డిజైన్ విషయానికి వస్తే, ఈ రోజు టీవీని చుట్టుముట్టే స్లిమ్ బెజెల్స్‌ను చూపించే ఒక చిత్రం మన వద్ద ఉంది, ఇది దాదాపు అంచులు లేని డిజైన్ ను ఇస్తుంది. ఈ టీవీకి ప్రీమియం మెటాలిక్ ఫ్రేమ్ ఉన్నట్లు కూడా నిర్ధారించబడింది.
నోకియా స్మార్ట్ టీవీని JBL స్పీకర్లతో అందించనున్నదని మేము ఇటీవల నివేదిక అందించాము. మీరు దాని గురించి ఇక్కడ మరింత చదవవచ్చు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile