అతి తక్కువ ధరకే ఇన్ బిల్ట్ సౌండ్ బార్ తో సినిమాటిక్ సౌండ్ స్మార్ట్ టీవీ విడుదల

Updated on 12-Feb-2020
HIGHLIGHTS

మీరు చూసే సినిమాలు లేదా కంటెంట్ ను మంచి Sound తో మీరు ఆస్వాదించేందుకు వీలుకల్పిస్తుంది.

ప్రసుత్తం, అన్ని ప్రధాన ఇంటర్నషన్ బ్రాండ్స్ అన్ని కూడా భారత్ వైపే చూస్తున్నట్లు కనబడుతోంది. అందుకేకావచ్చు, స్మార్ట్ ఫోన్లతో పాటుగా టీవీలను కూడా అతివేగంగా  ఇండియాలో లాంచ్ చేస్తున్నాయి. తక్కువ ధరకు మంచి టీవీలను అందిస్తున్న బ్రాండ్ గా పేరుపొందిన Detel నుండి మరొక LED టీవీ ఈరోజు ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ టీవీలో ఒక అంతర్గత సౌండ్ బార్ తో పాటుగా ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ మరిన్ని ప్రత్యేకతలను అందించింది.

డీటెల్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ

ఇండియాలో, డీటెల్ లాంచ్ చేసిన ఈ 43 ఇంచ్ స్మార్ట్ LED టీవీ మీకు FHD రిజల్యూషన్ తో వస్తుంది. అంటే, ఇది 1920 x 1080  పిక్సెళ్ళ రిజల్యూషన్ ఇస్తుంది. ఇది స్మార్ట్ టీవీ మరియు ఆండ్రాయిడ్ 8.0 ఒరియో ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఈ టీవిలో మీకు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజిని కూడా అఫర్ చేస్తోంది. ఇక ఇందులో అందించిన సౌండ్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీవీ మీకు అద్భుతమైన సినీమ్యాటిక్ సౌండ్ అందించగల ఒక ఇన్ బిల్ట్ సౌండ్ బార్ మరియు పవర్ సౌండ్ కంట్రోల్ తో వస్తుంది. ఇది మీరు చూసే సినిమాలు లేదా కంటెంట్ ను మంచి Sound తో మీరు ఆస్వాదించేందుకు వీలుకల్పిస్తుంది.

ఇక ఇందులో అందించిన పోర్టులు గురించి చూస్తే, ఇందులో మీకు 2HDMI పోర్టులు, 2USB మల్టి మీడియా పోర్టులు మరియు మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కోసం ఒక డెస్క్ టాప్ ల వాడుకోవాడానికి ఉపయోగపడే VGA పోర్టును కూడా ఇచ్చింది. ఇందులో ప్రత్యేకమైన Google Assistant బాట ను కూడా టీవీ రిమోటులో అందించింది.

డీటెల్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ : ధర

డీటెల్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ధర – Rs. 24,999/- 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :