ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Daiwa ఇండియాలో రెండు కొత్త smart Tv లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ టీవీ లను కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీల సేల్ ను కూడా కంపెనీ ప్రారంభించింది. డైవా సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
డైవా ఇండియాలో 32 ఇంచ్ HD Ready మరియు 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఇందులో 32 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 7,499 ప్రైస్ ట్యాగ్ తో, 43 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 13,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది.
ఈ రెండు స్మార్ట్ టీవీ లను Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ టీవీల పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అందించింది. ఈ టీవీ లను BOBCARD, Federal మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Pushpa 2 OTT రిలీజ్ డేట్ మరియు కొత్త అప్డేట్ తెలుసుకోండి.!
డైవా లాంచ్ చేసిన ఈ టీవీ లలో 32 ఇంచ్ టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు 43 ఇంచ్ టీవీ FHD (1920 X 1080) రిజల్యూషన్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు డైమండ్ కట్ స్లిమ్ బెజెల్స్ డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ రెండు టీవీలు Amlogic 921 A34x4 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 512MB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ ను కలిగి ఉంటాయి.
ఈ రెండు ఫోన్లు కూడా 20W బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటాయి మరియు Surround Sound సపోర్ట్ ను కూడా కలిగి ఉంటాయి. ఈ టీవీలు HDMI, USB, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటాయి.